ఉపాధి కూలీలకు కనీస వేతనం అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పెన్పహాడ్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంపిడిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతు పెన్పహాడ్ మండలంలో గత నాలుగు వారాలుగా పనిచేస్తున్న కూలీలకు దినసరి వేతనంగా 60.70రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ప్రభుత్వం ప్రకటించిన రూ.237దినసరి వేతనంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏపిఓ రవికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గుంజ వెంకటేశ్వర్లు, ఉపాధి మేట్ల సంఘం నాయకులు ఓగ్గు శ్రీను, రాజేశ్వరీ, నీలకంఠం, శోభ, హుస్సేన్, బత్తిని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.