Take a fresh look at your lifestyle.

‘ప్రమాదంలో’ కనీస మద్దతు ధర

“మోడీ చేసిన వ్యవసాయ చట్టాల రద్దు వలన దేశంలో వున్నా దాదాపు 10 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతాంగం, 15 కోట్ల మంది వ్యవసాయ శ్రామికుల భవితవ్యం ఏమాత్రం మారదు. వ్యవసాయ చట్టాల అమలు వలన వీళ్ళు స్థితి గతిలో ఏం మార్పు ఉండబోదు. చిన్న, సన్నకారు రైతాంగం, వ్యవసాయ శ్రామికులు ప్రస్తుతం ధనిక రైతుల చేతుల్లో దోపిడీకి గురి అవుతున్నారు. ఈ వ్యవసాయ చట్టాలు అమలు అయితే కార్పొరేట్‌ ‌కంపెనీల చేతుల్లో దోపిడీకి గురి అవుతారు. వీరి పరిస్థితిలో వ్యవసాయ చట్టాల అమలు లేదా రద్దు ఎలాంటి ప్రభావం చూపటం లేదు అనేది కీలకాంశం. వీరు దోపిడీకి గురవుతూనే వున్నారు. ప్రస్తుత వ్యవసాయ చట్టాల రద్దు రైతు ఉద్యమ నాయకుల్లో చీలికలు తెచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.”

ప్రస్తుతం మూడు వ్యవసాయ చట్టాల రద్దు తర్వాత బడా కార్పొరేట్‌ ‌కంపెనీలపై ధనిక వ్యవసాయ రైతులు విజయం సాధించారు అనేది స్పష్టం. అదే సమయంలో వ్యవసాయ వర్కింగ్‌ ‌క్లాస్‌కు కలిగిన ఊరట ఏం లేదు అనేది కూడా స్పష్టమే. వ్యవసాయ చట్టాల రద్దు వలన దేశంలో వున్నా దాదాపు 10 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకి, 15 కోట్ల మంది వ్యవసాయ శ్రామికులకు ఏమాత్రం ఊరట నివ్వదు.

మోడీ సర్కార్‌ ‌వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవటం వెనుక కారణాలు గమనిస్తే..
యూపీలో రానున్న శాసనసభ ఎన్నికల్లో వెస్ట్రన్‌ ‌యూపీలో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందని మేఘాలయ గవర్నర్‌ ‌సత్యపాల్‌ ‌మాలిక్‌ ‌మోదీ ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కింది స్థాయి కార్యకర్తల నుండి యూపీ ఎన్నికల ప్రమాద ఘంటికలపై బిజెపి నాయకత్వానికి నివేదికలు అందాయి. ఈస్ట్రన్‌ ‌యుపిలో ఉపాధి, ఆహార భద్రత పధకాలు ప్రభావం చూపలేదు.ఇక్కడ పేదరికం తొలగించటంలో యోగి ఆదిత్యనాధ్‌ ‌ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది. ఈ కారణాల వలన యుపి అసెంబ్లీ బిజెపి చేతిలో నుండి జారిపోవచ్చు అనే పరిస్థితి నెలకొంది. ఇదే జరిగితే 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపుకి గండి పడుతుంది. యుపిలో బిజెపి విజయావకాశాలను పక్కా చేసుకోవటానికి జాట్‌ల వోటు బ్యాంకును జాగ్రత్త పరుచుకోవటం బీజేపీకి అవసరం. అందుకే తక్షణ రాజకీయ అవసరాల దృష్ట్యా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుత రైతు ఉద్యమం మోడీ ప్రభుత్వ మెడలు వంచగలింది.

‘‘కొంతకాలం తర్వాత, ప్రస్తుత చట్టాలను కొన్ని సంస్కరణలతో తిరిగి తీసుకువస్తామని, అప్పుడు రైతులందరినీ ఒప్పిస్తామని బిజెపి నాయకుడు జాతవ్‌, ‌మోడీ ప్రకటన చేసిన కొద్ది నిమిషులకే మీడియాకి చెప్పడం గమనార్హం. మోడీ కూడా చట్టాల రద్దు ప్రకటన చేస్తున్నప్పుడు తన ప్రభుత్వం ‘‘రైతులలోని చిన్న వర్గాన్ని’’ మాత్రమే ఒప్పించలేక పోయినందున, వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. ఈ మాటలు మోడీ ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కార్పొరేట్‌ ‌కంపెనీలు కనీస మద్దతు ధర(ఎంఎస్‌ ‌పీ) వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కోరుతున్నాయి. అంచేత ముందు లేదా వెనుకగా, మోడీ ప్రభుత్వం ఎంఎస్‌ ‌పీ రద్దుకు సిద్దపడటం తధ్యం.

తక్షణ రాజకీయ అవసరాలు (2022లో యుపి శాసనసభ ఎన్నికలు మరియు 2024లో లోక్‌సభ ఎన్నికలు) వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా చేసాయి అనేది స్పష్టం. ఈసారి పశ్చిమ యుపి ప్రాంతం బూత్‌ ‌నిర్వహణ పనిని బ్రజ్‌ ‌మరియు అమిత్‌ ‌షా ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండటం గమనార్హం. ఈ కారణంగానే పశ్చిమ యుపిలో ఎన్నికలలో జూదం ఆడటానికి బిజెపి నాయకత్వం సిద్ధంగా లేదు. హర్యానాలో మాదిరిగా పశ్చిమ యూపీలో జాట్‌యేతర వోట్లను సమీకరించే అవకాశం లేదు. కారణం ఇక్కడ గణనీయమైన ముస్లిం జనాభా ఉంది. వీరిని హ్యాండిల్‌ ‌చేయటం బీజేపీకి కష్టం. జాట్‌ ‌వోటు బ్యాంకులో ప్రాబల్యాన్ని కోల్పోతే జాట్‌-‌ముస్లిం జత కలిసిపోతే ఈ ఎన్నికలలో బిజెపికి మేలు జరగదు. ఇక్కడ హర్యానాలా కాదు అంచేత పశ్చిమ యుపిలో జాట్‌ ‌వోటు బ్యాంకును బీజేపీ విస్మరించలేదు. పశ్చిమ యూపీలో జాట్‌లు దాదాపు 17 శాతం వోట్లను కలిగి ఉన్నారు. ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా 25 శాతానికి పైగా ఉంది. ఇటీవల, జాట్‌ ‌మరియు గుర్జర్‌ ‌కమ్యూనిటీ వారి నాయకులను బీజేపీ సన్మానించి బుజ్జగించింది. అలీఘర్‌లోని ఒక యూనివర్సిటీకి జాట్‌ ‌రాజు పేరు పెట్టారు. జాట్‌ల మధ్య ఇటీవల ఏర్పడిన బీజేపీ వ్యతిరేకతను చీలికలు కట్టడి చేసేందుకు వ్యవసాయ చట్టాల రద్దుతో బీజేపీ ఎన్నికలకి సిద్దపడింది. మరో మాటలో చెప్పాలంటే, యుపి ఎన్నికలలో బిజెపి విజయం అనేది బీజేపీకి కావాలి. మరీ ముఖ్యంగా పశ్చిమ యుపి ఎన్నికలకి కీలక పాత్ర ఉంది. యుపి ఎన్నికలలో విజయం లోక్‌సభ ఎన్నికలలో బిజెపి విజయానికి కీలకం.

ఇప్పుడు రైతు నాయకులూ రాకేష్‌ ‌టికైత్‌ ‌కూడా బిజెపికి మద్దతు ఇవ్వడానికి మరియు బిజెపికి ప్రచారం చేయడానికి ముందుకు రావచ్చు. రానున్న యుపి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ యుపిలో జాట్‌లు మరియు ముస్లింల మధ్య మతపరమైన ఉద్రిక్తతలను మరోసారి పెంచడానికి ప్రయత్నాలు జరగవచ్చు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు కారణంగా పంజాబ్‌లో సమీకరణాలు మారవచ్చు. పంజాబ్‌లో ప్రస్తుతం బీజేపీకి కీలక లింక్‌ ‌కెప్టెన్‌ అ‌మ్రీందర్‌ ‌సింగ్‌. ‌మోడీ ప్రసంగం ముగిసిన వెంటనే ట్వీట్‌ ‌చేస్తూ మోడీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. చట్టాలను రద్దు చేయాలని బిజెపి ప్రభుత్వాన్ని ఒప్పించింది తానేనని అమరీందర్‌ ‌సింగ్‌ ‌ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు, అమ్రీందర్‌ ‌సింగ్‌ ‌బిజెపికి మిత్రుడు కావచ్చు. ఇక పంజాబ్‌ ‌లో బహిరంగంగా లేదా అమరీందర్‌ ‌సింగ్‌ అనే తాడు పట్టుకుని బీజేపీ పంజాబ్‌ ‌లో లాభ పడటానికి అవకాశాలు పుష్కలంగా వున్నాయి. అమరీందర్‌ ‌సింగ్‌ ‌వంటి స్నేహితుల సహకారంతో పంజాబ్‌లో బీజేపీకి మూసిన తలుపులు కాస్త తెరుచుకోనున్నాయి. రైతు ఉద్యమంలో నిస్సందేహంగా ప్రముఖ పాత్ర పోషించిన సిక్కుల మనోభావాలను శాంతింపజేసేందుకు గురుపూరాబ్‌ ‌సందర్భంగా మోడీ తన ప్రసంగంలో సిక్కు గ్రంధాలలోని మాటలను చెబుతూ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు.

మోడీ చేసిన వ్యవసాయ చట్టాల రద్దు వలన దేశంలో వున్నా దాదాపు 10 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతాంగం, 15 కోట్ల మంది వ్యవసాయ శ్రామికుల భవితవ్యం ఏమాత్రం మారదు. వ్యవసాయ చట్టాల అమలు వలన వీళ్ళు స్థితి గతిలో ఏం మార్పు ఉండబోదు. చిన్న, సన్నకారు రైతాంగం, వ్యవసాయ శ్రామికులు ప్రస్తుతం ధనిక రైతుల చేతుల్లో దోపిడీకి గురి అవుతున్నారు. ఈ వ్యవసాయ చట్టాలు అమలు అయితే కార్పొరేట్‌ ‌కంపెనీల చేతుల్లో దోపిడీకి గురి అవుతారు. వీరి పరిస్థితిలో వ్యవసాయ చట్టాల అమలు లేదా రద్దు ఎలాంటి ప్రభావం చూపటం లేదు అనేది కీలకాంశం. వీరు దోపిడీకి గురవుతూనే వున్నారు. ప్రస్తుత వ్యవసాయ చట్టాల రద్దు రైతు ఉద్యమ నాయకుల్లో చీలికలు తెచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

aruna serior journalist
అరుణ, జర్నలిస్ట్, ‌న్యూ దిల్లీ

Leave a Reply