Take a fresh look at your lifestyle.

కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి : సిపిఐ

ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి సౌకర్యాలు కల్పించాలని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. శుక్రవారం మండలంలోని గానుగబండ, గారకుంటతండా, గరిడేపల్లి గ్రామాల్లో జరుగుతున్న •పాధి హామీ పనులు పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పని ప్రదేశాల్లో కనీసం కూలీలకు మంచినీరు, టెంట్‌, ‌ఫస్ట్ ఎయిడ్‌ ‌సౌకర్యం లేదన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లంతా పేదవర్గాలకు చెందిన వారే ఎక్కువగా •న్నారని, వేతనాలందక కుటుంబాలు వెళ్లక జీవనం కష్టతరంగా మారిందని వాపోయారు. ప్రభుత్వం మానవతా దృక్పధంతో ఆలోచించి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఆయన వెంట కడియాల అప్పయ్య, పంగ బక్కయ్య, గోవింద, సైదులు •న్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!