Take a fresh look at your lifestyle.

కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ ‌పార్క్

  • నేతన్నలకు ప్రయోజనం కలింగేలా చర్యలు
  • చేనేతపై సమిక్షలో మంత్రి కెటిఆర్‌

‌వరంగల్‌ ‌జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ ‌పార్కును ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు విజ్ఞప్తి మేరకు అక్కడ ఉన్న నేతన్నలకు మరింత ప్రయోజనం కల్పించే దిశగా ఒక మినీ పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో కొడకండ్లలో పార్క్ ఏర్పాటుకు ఉన్న అనుకూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని మినీ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. నైపుణ్యం కలిగిన వేలాదిమంది నేతన్నలు కొడకండ్లలో తమ పని కొనసాగిస్తున్నారని, చాలామందికి సరైన ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళారని, అయితే రాష్ట్రంలో తాము అధికారంలోకి వొచ్చిన తర్వాత, క్స్‌టైల్‌ ‌రంగానికి ఇస్తున్న మద్ధతు వల్ల అనేకమంది తెలంగాణకు తిరిగి వొచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

ఇదేవిధంగా కొడకండ్లలోనూ వందలాది మంది పార్క్ ఏర్పాటు కావాలని కోరుతున్న నేపథ్యంలో మినీ టెక్స్‌టైల్‌ ‌పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం ప్రగతి భవన్‌లో జరిగిన టెక్స్‌టైల్‌ ‌డిపార్ట్‌మెంట్‌ ‌సవి•క్షా సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ఈ ‌నిర్ణయం తీసుకున్నారు. మినీ టెక్స్‌టైల్‌ ‌పార్కు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినందుకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు వరంగల్‌ ‌జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు కృతజ్ఞతలు తెలిపారు. పార్క్ ‌ద్వారా కొడకండ్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సుమారు 20వేల నేతన్న కుటుంబాలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని దయాకర్‌ ‌రావు అన్నారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ‌చేనేత జౌళి రంగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను సమిక్షించారు.

Leave a Reply