Take a fresh look at your lifestyle.

మైండ్‌స్పేస్‌ ‌బిల్డింగ్‌ ‌ఖాలీ

  • ఐటీ ఉద్యోగులు ఇళ్లకు పంపివేత
  • పలు కంపెనీల్లో ‘వర్క్ ‌ఫ్రం హోమ్‌’ ఆదేశాలు

హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో కరోనా కలవరం మొదలైంది. పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు కొలువుదీరిన రహేజా మైండ్‌ ‌స్పేస్‌లోని బిల్డింగ్‌ ‌నంబర్‌ 20‌లో పనిచేస్తున్న ఓ ఐటీ ఉద్యోగినికి కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్ ‌వచ్చిందన్న సమాచారంతో బిల్డింగ్‌ ‌నంబర్‌ 20‌లోని ఐటీ కంపెనీలన్నీ బుధవారం తమ ఉద్యోగులను ఇళ్లకు పంపించేశాయి. అంతేకాదు, హైదరా బాద్‌లో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో పలు ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు ‘వర్క్ ‌ఫ్రం హోమ్‌’ ఆదేశాలను జారీ చేశాయి.మైండ్‌ ‌స్పేస్‌ ‌కాంప్లెక్స్)‌లో దాదాపు 2వేల మందికిపైగా ఉద్యోగులున్నారు. కరోనా పాజిటివ్‌గా తేలిన ఉద్యోగిని డచ్‌కు చెందిన ఐటీ కంపెనీ డీఎస్‌ఎం‌లో విధులు నిర్వర్తిస్తోంది. ఉద్యోగులను ఇంటికి పంపించేసిన ఈ కంపెనీ శుభ్రత చర్యలను చేపట్టింది. అయితే ఈ వార్తలకు భిన్నంగా సీపీ సజ్జనార్‌ ‌ప్రకటన చేసారు.

ఉద్యోగులకు కరోనా లక్షణాలు లేవు..సీ పీ సజ్జనార్‌
‌బుధవారం ఐ టీ కారిడార్‌ ‌ప్రతినిధులతో సైబరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ‌ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ, కోవిడ్‌ ‌వైరస్‌ ‌పై వచ్చే వదంతులు నమ్మవద్దని, తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐ టీ ఉద్యోగులకు కోవిడ్‌ ‌లక్షణాలు లేవని స్పష్టం చేశారు.ఐ టీ కారిడార్‌ ‌ఖాళీ చేస్తున్నది అవాస్తవం అని కొట్టిపారేశారు. రెపటినుండి ఐ టి ఉద్యోగులు యధావిధిగా విధులకు హాజరవుతారని తెలిపారు.

Leave a Reply