- ఉద్యోగులు ఇళ్లకు పంపివేత
- పలు కంపెనీల్లో ‘వర్క్ ఫ్రం హోమ్’ ఆదేశాలు
హైదరబాద్: హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో కరోనా కలవరం మొదలైంది. పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు కొలువుదీరిన రహేజా మైండ్ స్పేస్‌లోని బిల్డింగ్ నంబర్ 20లో పనిచేస్తున్న ఓ ఐటీ ఉద్యోగినికి కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చిందన్న సమాచారంతో బిల్డింగ్ నంబర్ 20లోని ఐటీ కంపెనీలన్నీ బుధవారం తమ ఉద్యోగులను ఇళ్లకు పంపించేశాయి. అంతేకాదు, హైదరాబాద్‌లో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో పలు ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోమ్’ ఆదేశాలను జారీ చేశాయి.మైండ్ స్పేస్ కాంప్లెక్స్)లో దాదాపు 2వేల మందికిపైగా ఉద్యోగులున్నారు.
కరోనా పాజిటివ్‌గా తేలిన ఉద్యోగిని డచ్‌కు చెందిన ఐటీ కంపెనీ డీఎస్ఎంలో విధులు నిర్వర్తిస్తోంది. ఉద్యోగులను ఇంటికి పంపించేసిన ఈ కంపెనీ శుభ్రత చర్యలను చేపట్టింది. ఇప్పటివరకూ ఇండియాలో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.