Take a fresh look at your lifestyle.

త్వరలో హైదరాబాద్‌ ‌లో నిరుద్యోగులతో ‘‘మిలియన్‌ ‌మార్చ్’’

  • ‌కాషాయ సైనికులారా……‘‘నిరుద్యోగ మార్చ్’’‌తో గర్జిద్దాం రండి..
  • ఉద్యోగాలివ్వకపోతే సర్కార్‌ ఉనికికే ప్రమాదం ఉందనే భావన కలిగేలా ఉద్యమిద్దాం
  • సీఎం కుటుంబాని గుణపాఠం చెబుదాం
  • పేపర్‌ ‌లీకేజీపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాల్సిందే
  • సీఎం కొడుకును బర్తరఫ్‌ ‌చేయాల్సిందే
  • నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాల్సిందే..
  • ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా పోలింగ్‌ ‌బూత్‌ ‌కార్యకర్తలతో టెలికాన్పరెన్స్ ‌లో బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలు

:బీజేపీ నిర్వహించే ‘‘నిరుద్యోగ మార్చ్’’‌తో సీఎం కుటుంబానికి గుణపాఠం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ అన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన బీజేపీ చేస్తున్న పోరాటాలతో గడీలు బద్దలు కావాలని, ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రభుత్వానికి ముప్పు వచ్చే ప్రమాదం ఉందనే భావన సీఎంకు కలిగేలా ఈనెల 11న సంగారెడ్డి పట్టణంలో నిర్వహించే ‘నిరుద్యోగ మార్చ్’’ ‌ద్వారా గర్జించాలని పిలుపునిచ్చారు. కాషాయ సైనికులంతా ఈ ర్యాలీకి తరలిరావాలని పిలుపునిచ్చారు. బుధవారం  ఉదయం ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా పోలింగ్‌ ‌బూత్‌ ‌కార్యకర్తలతో బండి సంజయ్‌ ‌టెలికాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్‌ఎస్‌ ‌ప్రభాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్ ‌లో కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి టి.వీరేందర్‌ ‌గౌడ్‌,  ఆకుల విజయ, దరువు ఎల్లన్న, పుల్లారావు తదితరులు పాల్గొన్న ఈ టెలికాన్ఫరెన్స్ ‌లో బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ..10 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ ‌ద్వారా నిరుద్యోగులకు అండగా నిలవాలన్నదే లక్ష్యం.. ఉమ్మడి వరంగల్‌, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలివచ్చి సక్సెస్‌ ‌చేశారు.. దేశవ్యాప్త చర్చ జరిగింది..  కేసీఆర్‌ ‌నిరంకుశ, నియంత విధానాలపై గర్జించి గాండ్రించాలి..అని పిలుపునిచ్చారు.ఆయా జిల్లాలకు ధీటుగా ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోనూ నిరుద్యోగ మార్చ్ ‌నిర్వహించాలి.

ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా బీజేపీ అడ్డా కావాలి. పోలింగ్‌ ‌బూత్‌ ‌కార్యకర్తలంతా పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. కేంద్రం నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎక్కడా అక్రమాలు, అవినీతి జరగడం లేదు.. ఏటా క్రమం తప్పకుండా నోటీఫికేషన్లు ఇస్తూ షెడ్యూల్‌ ‌ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆ పనిచేయడం లేదు..? పేపర్‌ ‌లీకేజీకి బాధ్యుడైన ఐటీ మంత్రి సీఎం కొడుకు ఎందుకు రాజీనామా చేయడం లేదు..? అకమార్కులను కాపాడటానికే సిట్‌ ‌విచారణ చేస్తున్నారే తప్ప ఇప్పటి వరకు నివేదిక ఎందుకు ఇవ్వలేదు..అని ప్రశ్నించారు.ఈ విషయాలన్నీ నిరుద్యోగులకు చెప్పాలి.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే..అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామనే సంకేతాలను పంపాలి.. ఎలాంటి తప్పిదాల్లేకుండా యూపీఎస్సీ తరహాలో జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌నిర్వహించి పరీక్షలు నిర్వహిస్తాం..అని విద్యార్థులకు భరోసానివవలన్నారు.

సీఎం కుటుంబానికి గుణ పాఠం అయ్యేలా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ మార్చ్ ‌నిర్వహ్తిస్తాం.. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా తరువాత ఖమ్మం, ఆ తరువాత ఇతర ఉమ్మడి జిల్లాల్లో నిర్వహిస్తాం.. అనంతరం అతి త్వరలో హైదరాబాద్‌ ‌లో నిరుద్యోగులతో నిర్వహించే ‘‘మిలియన్‌ ‌మార్చ్’’ ‌గడీలు బద్దలు కావాలి.. సీఎం కుటుంబానికి గుణపాఠం కావాలి.. ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రభుత్వానికి ముప్పు వచ్చే ప్రమాదం ఉందనే ఆలోచన వచ్చేలా గర్జిద్దాం..పేపర్‌ ‌లీకేజీ విషయంలో జరుగుతున్న సిట్‌ ‌విచారణతో ప్రయోజనం లేదు. సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలి.. అవినీతి ఆరోపణలొస్తే కొందరిని మంత్రి పదవి నుండి తప్పించిన కేసీఆర్‌ ఇయాళ లీకేజీకి కారణమైన ఐటీశాఖకు మంత్రి ఉన్న కొడుకును కేబినెట్‌ ‌నుండి ఎందుకు బర్తరఫ్‌ ‌చేయడం లేదు..? వెంటనే ఆయనను కేబినెట్‌ ‌నుండి తొలగించాలి.. అవినీతి కూపంలో కూరుకుపోయిన టీఎస్పీఎస్సీ కమిటీని రద్దు చేయాలి.. నష్టపోయిన నిరుద్యోగులకు  రూ.లక్ష పరిహారం ఇవ్వాలి..అని బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేసారు.

Leave a Reply