Take a fresh look at your lifestyle.

కొనుగోలులో ప్రభుత్వానికి మిల్లర్లు సహకరించాలి

రైతులను సకాలంలో ఆదుకుంటాం – కొండపోచమ్మ సాగర్‌ ‌కాలువ పనులు ప్రారంభం : మంత్రి హరీష్‌ ‌రావు

మెదక్‌ ‌మే 6 ( ప్రజాతంత్ర ప్రతినిధి) :కాలేశ్వరం ప్రాజెక్టు కాలువ అ నిర్మాణ పనులు లో భూమి కోల్పోయిన రైతులను సకాలంలో ఆదుకుంటారని . రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని ప్రభుత్వం ప్రకటించిన లాక్‌ ‌డౌన్‌ ‌నేపథ్యంలో తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు గాను జాతీయ రహదారి వెంబడి వెళ్తున్న వలస కూలీలకు ఎవరైనా దాతల సహకారంతో చెప్పులను అందజేసేందుకు కృషి చేయాలని అధికారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు సూచించారు. మెదక్‌ ‌జిల్లా రామాయంపేట చిన్న శంకరం పేట మెదక్‌ ‌తదితర ప్రాంతాలలో మంత్రి హరీష్‌ ‌రావు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌నిర్మాణాల పనులను వేగవంతం చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న పనుల వల్ల ప్రారంభోత్సవాలు ఆగని వాటిని సత్వరం పూర్తి చేసి ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇసుక, టీలు మరియు సిమెంట్‌ ‌కొరత లేకుండా ఉండేందుకు గాను తగిన ఏర్పాట్లు చేసుకుని నిర్మాణాలను వేగవంతం చేయాల న్నారు. అలాగే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన సిసి రోడ్లకు ఇప్పటికే బిల్లులకు అప్లోడ్‌ ‌చేసిన పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. రానున్న 15 రోజుల్లో ఈ సిసి రోడ్లను పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. పనులకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక ఎమ్మెల్యే ల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

ఉపాధి హామీ పనుల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో మెరుగైన ర్యాంకు లో ఉంద న్నారు. ఉపాధి హామీ పనుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచేందుకు అన్ని విభాగాల అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించా రు. ఇప్పటికే కొన్ని మండలాల్లో ఉపాధి హామీ పనులకు కూలీలు సరిగ్గా రావడం లేదని ఆయా మండలాల ఎంపీడీ వోలు ప్రత్యేక చొరవ తీసుకొని క్షేత్ర స్థాయి సమీక్ష నిర్వహిం చి కూలీలను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల న్నారు. అలాగే లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులు మరియు ఇతర రంగాల కార్మికులను గుర్తించి వారికి వెంటనే జాబ్‌ ‌కార్డులను అందజేసి ఉపాధి పని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హాఉపాధి హామీ పని కోసం జాబ్‌ ‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 24గంటల్లో జాబ్‌ ‌కార్డు అందజేయాలని ఆదేశించారు. గతంలో పనిచేసిన ఉపాధి కూలీలకు పెండిం గ్లో ఉన్న బకాయిలను పోస్టాఫీసు ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేందుకు గాను ఎంపీడీవోలు, ఏపీఓ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వారం రోజుల్లోగా పెండిం గ్లో ఉన్న బకాయిలు అన్నిటిని చెల్లించేందుకు గాను అవసర మైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడం ఇందుకు గాను ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందనీ, గ్రామాలలోని నర్సరీలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుందని తనిఖీలో నర్సరీలో మొక్కలు లేని గ్రామాలకి చెందిన సర్పం చ్‌, ‌మరియు పంచాయతీ సెక్రెటరీలను సస్పెండ్‌ ‌చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీ గా అమలు చేయాలని ఈ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలకు వెనుకాడం ఏది లేదని మంత్రి స్పష్టం చేశారు. గతంలో నాటిన మొక్క లో ఎక్కడైనా మొక్క చనిపోతే ఆ స్థానంలో తిరిగి వేరొక మొక్కలు నాటి సంరక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను కొనుగోలు లేక ఏ రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కనీస మద్దతు ధరకు రైతుల నుండి కొనుగోలు చేస్తుందని ఈ విషయంలో రైస్‌ ‌మిల్లర్లు ప్రభుత్వానికి తమ సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు.

జిల్లాలో ఎలాంటి సమస్యలు లేకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని, తాలు మరియు మిల్లులో దించుకోవడం సమస్యతో ఆయా కేంద్రాల్లో కొనుగోలు మందకొడిగా సాగుతున్నాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నుండి వచ్చే ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు గాను రైస్‌ ‌మిల్లర్‌ ‌లేబర్‌ ‌ను పెంచుకోవాలని మంత్రి సూచించారు ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్‌ ‌లను అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నిజాంపేట మండలం నార్లపూర్‌ ‌లో కొండపోచమ్మ సాగర్‌ ‌కాలువ నిర్మాణ పనులు ప్రారంభించారు చిన్న శంకరం పేట మండలం మిర్జాపల్లి లో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు అనంతరం మెదక్‌ ‌పట్టణంలో ఆల్‌ ఇం‌డియా మెడికల్‌ అసోసియేషన్‌ ‌వారు అందించిన 5 లక్షల పైచిలుకు చెక్కును తీసుకున్నారు మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ రైతు బంధు పథకం కొనసాగుతుందని వివరించారు ప్రభుత్వ విధానాలు నచ్చక ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని వారి నైతిక విధానానికి వారే బాధ్యులు అని ఎద్దేవా చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం పాట పడుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కలెక్టర్‌ ‌ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు రామాయంపేటలో కాలేశ్వరం నిర్మాణ పనులు భూమి కోల్పోయిన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!