Take a fresh look at your lifestyle.

ప్రమాదం ముంచుకొస్తున్నప్పటికీ..

  • ‘‘వెయ్యేళ్ల అయోధ్య రామా నవమి’’
  • మేలాని జరపాలని తలపెట్టిన యూపీ

- Advertisement -

కొరోనా వైరస్‌ ‌మహమ్మారి ప్రమాదం ముంచుకొస్తున్నప్పటికి కూడా ఉత్తర ప్రదేశ్‌ ‌ప్రభుత్వం ‘‘వెయ్యేళ్ల అయోధ్య రామా నవమి’’ అంటూ రామ నవమి నాడు పెద్ద మేలాని జరపాలి అని తలపెట్టింది. ఈ మేలాకి దేశవ్యాప్తంగా లక్షలాది మంది యాత్రికులు వచ్చేలాగా యాత్రికులను ఆకర్షించే ప్రయత్నం ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం చేస్తున్నది. ఈ మేలా మార్చి 25 నుండి ఏప్రిల్‌ 2 ‌వరకు జరుగుతుంది. మరోవైపు అయోధ్య చీఫ్‌ ‌మెడికల్‌ ఆఫీసర్‌ ‌ప్రస్తుత సమయంలో ఒకే చోట భారీగా గుమిగూడడం వల్ల కలిగే చిక్కుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌ ‌ప్రభుత్వం అయోధ్య చీఫ్‌ ‌మెడికల్‌ ఆఫీసర్‌ ‌వ్యక్తం చేసిన అభిప్రాయాలను పక్కకు పెట్టి మేలా తలపెట్టింది.  ఈ నెలలో లక్నో, కోల్‌కతాలో జరగాల్సిన భారత్‌-‌దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్‌లను, హోలీ పండగ సహా సామూహిక సమావేశాలు జరపవద్దు అని ఆదేశాలు జారీ చేసిన ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ ‌సంవత్సరం రామ నవమి మేలాని మాత్రం భారీ స్థాయిలో చేస్తామని అంటున్నారు. ఈసారి మేలాకి అదనపు ప్రాముఖ్యత ఉందని, అయోధ్యలో రామాలయం నిర్మాణానికి సుప్రీమ్‌కోర్టు మార్గం సుగమం చేసిన తరువాత, వచ్చిన మొదటి రామ నవమి కనుక కొరోనా వైరస్‌ అయినా సరే ప్రభుత్వం వెనక్కి తగ్గదు అంటున్నారు యోగి ఆదిత్యనాథ్‌..

Leave a Reply