ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి తప్పతాలు పేరిట కొత విధించడం అన్యాయమని రైతులకు అండగా ఎప్పుడు ఉంటామని పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం గొల్లపల్లి మండల కేంద్రంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పరిశీలించారు. ఈసందర్బంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతు నుంచి తప్పతాలు పేరిట కోతలు విదిస్తు ప్రతి లారీలో నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ళ వరకు కోత విధిస్తున్నారన్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళానని జీవన్‌రెడ్డి అన్నారు.
రైతుల నుంచి దొపిడిని అడ్డుకొంటానని రైతులకు ఎల్లప్పుడు అండగా ఉంటానని చెప్పారు. ఆనంతరం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అడిషనల్ కలెక్టర్ రాజేశం దృష్టికి రైతుల సమస్యను తీసుకెళ్ళగా వెంటనే డిసివోను అక్కడికి పంపించారు. త్వరితగతిన కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు పంపించేలా ఎర్పాట్లు చూడాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు. ఈకార్యక్రమములో జిల్లా కాంగ్రెస్‌పార్టీ అద్యక్షులు అడ్లూరి లక్ష్మన్‌కుమార్, గొల్లపల్లి సర్పంచ్ ముస్కు నిషాంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బీమ సంతోష్, సురేందర్, సర్పంచ్‌లు గంగాధర్, సత్యనారాయణ, ఉప సర్పంచ్‌లు హరికిరణ్, శ్రీనివాస్, రాజారాంతోపాటు విజయ్, దిలిప్, మహేష్, అవుల ప్రవీణ్, విక్రమ్‌రెడ్డి, అమోస్, నవీన్, పవన్, రైతులు ఉన్నారు.