Take a fresh look at your lifestyle.

‘దూద్ దురంతో’  స్పెషల్  ద్వారా  పాల రవాణా

 

*కోటి లీటర్లు  దాటిన    లక్ష్యం

లాక్ డౌన్ కాలంలో   దక్షిణ మధ్య రైల్వే   రేణి గుంట నుంచి దేశ రాజధాని ఢిల్లీకి  ( హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కు) దూద్ దురంతో ప్రత్యేక రైలు ద్వారా పాలను రవాణా చేసింది.  కరోనా వైరస్ వ్యాప్తి  అవుతుందేమోనన్న   భయంతో రైళ్ళను నిలిపివేసినా,    లాక్ డౌన్ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండేట్టు చూడటం కోసం దక్షిణ మధ్య రైల్వే తగిన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా    కొత్త ఆలోచనకు రూపు ఇచ్చి పాల  రవాణాకు  ప్రత్యేక రైలును నడిపింది. రేణి గుంట  రైల్వే స్టేషన్ నుంచి  హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ కు   పాల ట్యాంకర్లతో ప్రత్యేక రైళ్ళను నడిపింది.  సాధారణంగా ప్రత్యేక రైళ్ళు ఆరు ట్యాంకర్లతో నడుస్తాయి. ప్రయాణీకుల రైళ్ళకు  మామూలు రోజుల్లో   పాలు, చమురు ట్యాంకర్లను   అనుసందానం చేస్తుంటారు.  మార్చి  26వ తేదీన  నుంచి పాల రవాణాకు ప్రత్యేక రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ఒక్కొక్క ట్యాంకర్ లో  40 వేల లీటర్ల పాలు ఉంటాయి  మొ త్తం   2 లక్షల 40 వేల లీటర్ల పాల రవాణా ఈ ట్యాంకర్ల ద్వారా జరుగుతోంది.   రోజు విడిచి రోజు  పాల రైలు  రేణి గుంట నుంచి బయలుదేరుతోంది. డిమాండ్ ను బట్టి     ఒక్కొసారి   8 ట్యాంకర్లన  కూడా ఈ రైళ్ళకు జత చేస్తున్నారు.  ఇప్పటి వరకూ   ఈ రైలు   42 సార్లు (ట్రిప్పులు) తిరిగింది.  దూద్ దురంతో రైళ్ళను  గంటకు  110 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు అనుమతి ఇచ్చినట్లు   సిహెచ్ రాకేష్, చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ , దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసారు .

36 గంటల్లో గమ్య స్థానం చేరేట్టు  వేగాన్ని నిర్ధారించారు. పాల రవాణా కోసం ప్రత్యేక రైళ్ళ నడపడంలో  పాలు పంచుకుంటున్న  అధికారులు,ఉద్యోగులను  దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్  గజానన్ మాల్య అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో   సమన్వయం చేసుకుంటూ ఈ రైళ్ళను నడపడంలో అధికారుల కృషిని  అభినందించారు.  అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇక ముందు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సింది

గా అధికారులకు ఆయన సలహా ఇచ్చారు.

Leave a Reply