Take a fresh look at your lifestyle.

ధైర్యానికి ప్రతీక మిలిటరీ కల్చర్‌

‘‘ ‌మిలిటరీ లో చేరిన యువత కు శిక్షణలో భాగంగా వారు నేర్చుకునే విలువలు నియామకం కాగానే పై అధికారుల పట్ల విధేయత, తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించడం, పెద్దల పట్ల గౌరవం, ఎలాంటి తన వ్యక్తిగత లాభం కోసం కాకుండా దేశం కోసం నిస్వార్థ సేవ చేయడం, దేశ సమగ్రతను కాపాడడంలో తన వంతు పాత్రను గుర్తించేలా చేయడం మరియు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే వ్యక్తిగత ధైర్యంను పెంపొందిస్తారు. తాను చేసే వృత్తి పట్ల నిబద్దతను నేర్పిస్తారు. చేసే ప్రతి పనిని సమర్దవంతంగా పూర్తిచేయునట్లుగా శిక్షణ కల్పిస్తారు. ఎలా ముందుకు వెళ్తే లక్ష్యాన్ని సాధించగలమనే మార్గ నిర్దేశనం చేస్తుంది. ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఏకాగ్రతను పెంపొందిస్తారు. వ్యక్తిగత భద్రత కంటే దేశ భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చే విధంగా తయారవుతారు.’’

‌సైనికుల సేవలు దేశం ఎప్పుడు మరువదు
మిలిటరీ కల్చర్‌ ‌తో ఆడపిల్లల అకృత్యాలపై చెక్‌ ‌పెట్టవచ్చు
దేశంలో మనమంతా ధైర్యంగా, స్వేచ్ఛగా జీవించగల గుతున్నామంటే.. అది భారత సైన్యం దయవల్లే. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మనలను కంటికి రెప్పలా కాపాడుతోన్న భారత సైనికులు, వారి ధైర్య సాహాసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

సైనికుల సేవలు దేశం ఎప్పుడు మరువదు
యుద్ధంలో నీకు అత్యంత విలువైనది ఏది?’ అని అడిగినప్పుడు ఏ దేశ సైనికుడైనా ‘రైఫిల్‌’ అనే చెబుతాడు. అతడికి రైఫిల్‌ ‌విలువైనదే కావచ్చు. కానీ దేశ పౌరులకు అతడి ప్రాణం విలువైనది. అందుకే దేశానికీ, దేశాధినేతలకూ ఇచ్చినంత గౌరవాన్ని మనం సైనికుడికీ ఇవ్వాలి. సైనికులలోని స్నేహశీలతను, సరిహద్దు గ్రామాల్లోని ప్రజలతో వారు కలిసి పోయిన తీరును చూస్తే అర్థం చేసుకోవచ్చు. ప్రతికూల పరిస్థితులలో సైతం వివేకం కోల్పోకుండా, నిగ్రహంతో సైనికులు తమ విధులలో నిమగ్నమై ఉండటం, దేశ సరిహద్దుల్లో ఇటువాళ్లు గానీ, అటువాళ్లు గానీ కయ్యానికి కాలు దువ్వుతుండే వాతావరణం లో కూడా దేశానికి వారు కాపలా కాస్తున్న సైనికులకు వందనం అభివందనం. సైనికుడు దేశాన్ని కాపాడితే, సైనికుడి కుటుంబాలను దేశ పౌరులు కాపాడాలి అన్న ఆలోచన అందరిలో ఉండాలి. ఎదురు పడిన సైనికుడికి వందనం చేసి ఊరుకోక నేను మీకెలాగైనా సహాయపడగలనా? అని అడగలిగే సాంప్రాదాయాన్నీ కొనసాగించాలి. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను జాతీ సదా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం నిశ్చింతగా ఉందంటే సైనికుల త్యాగాల ఫలమే. సైనికుల సేవలు దేశం ఎప్పుడు మరువదు. దేశ సరిహద్దుల్లో ఉండి సైనికుల్లా పనిచేస్తూ ఎన్నో ఒడిదుడుకులను, ఇబ్బందులను ఎదుర్కొని, తమ తల్లిదండ్రులకు దూరంగా ఉండి ధైర్యంగా పోరాడుతూ తమ ప్రాణాలను పోగొట్టుకున్న వీరజవాన్ల కుటుంబాలకు జోహార్లు.

ఆలోచించండి……..ఎదురుగా యుద్ద క్షిపణితో శతృదేశాలు దూసుకువస్తున్నా చేతితో చిన్న తుపాకీ పట్టుకొని ఒకవైపు చలికి వణుకుతూ, వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ సరిహద్దులో దేశ రక్షణకు ప్రాణాన్ని అరచేతిలో పట్టుకుని కూడా శత్రుసైనికులను చిత్తు చేసిన, చేస్తున్న సైనికుల గురించి ఆలోచించండి. అతనికి ఉన్న ఆ దైర్యం, ఆ ఆత్మ విశ్వాసం మనలో కలుగాలంటే ఏం చేయాలి.

మిలిటరీ అలవాట్లు విలువలు
మిలిటరీ లో చేరిన యువత కు శిక్షణలో భాగంగా వారు నేర్చుకునే విలువలు నియామకం కాగానే పై అధికారుల పట్ల విధేయత, తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించడం, పెద్దల పట్ల గౌరవం, ఎలాంటి తన వ్యక్తిగత లాభం కోసం కాకుండా దేశం కోసం నిస్వార్థ సేవ చేయడం, దేశ సమగ్రతను కాపాడడంలో తన వంతు పాత్రను గుర్తించేలా చేయడం మరియు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే వ్యక్తిగత ధైర్యంను పెంపొందిస్తారు. తాను చేసే వృత్తి పట్ల నిబద్దతను నేర్పిస్తారు. చేసే ప్రతి పనిని సమర్దవంతంగా పూర్తిచేయునట్లుగా శిక్షణ కల్పిస్తారు. ఎలా ముందుకు వెళ్తే లక్ష్యాన్ని సాధించగలమనే మార్గ నిర్దేశనం చేస్తుంది. ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఏకాగ్రతను పెంపొందిస్తారు. వ్యక్తిగత భద్రత కంటే దేశ భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చే విధంగా తయారవుతారు. తీవ్ర ఒత్తిడికి లోనయ్యే పరిస్థితుల నుండి ఎలా అధిగమించాలి. లక్ష్యం సాధించడంలో ఎలా దృస్టి ని కేంద్రీకరించాలి. అన్నీ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొనేలా ట్రైనింగ్‌ ఇస్తారు. పోరాటం చేసే నైపుణ్యాలను అభ్యసిస్తారు.

నిజమైన సేవకులు సైనికులే
మిలటరీలో చేరి శిక్షణ తీసుకున్న వారికి ముఖ్యంగా వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది. ఉన్నతంగా ఎదగడంలో ఈ శిక్షణ ఎంతగానో తోడ్పడుతుంది. సైనికులు వాళ్ళు. దేశం కోసం ప్రాణాలిస్తారు. స్వార్థం లేదు. రాజకీయం రాదు. ఆస్తులు, అధికారాల కోసం కాక దేశ భద్రత కోసం పోరాడుతారు. సైన్యం సర్వం త్యాగం చేస్తున్నది. మనలను రక్షిస్తున్నది. భారతదేశంలోని 126 కోట్ల పై చిలుకు మంది ప్రజల భద్రత సైనికుల చేతుల్లో ఉందని, దేశానికి నిజమైన సేవకులు సైనికులే.

యువతకు సైన్యంలో శిక్షణ
దేశాన్ని తీర్చిదిద్దే విషయంలో యువత ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నామంటే అలనాడు స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులు, నేడు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల సేవలు కారణం. ఎముకలు కొరికే చలిలో కూడా దేశం కోసం పనిచేస్తున్న సైనికుల గురించి నేటి యువత ఆలోచించాలి. తమ ఆలోచనలలో మార్పు రావాలి. దేశంలోని యువతకు తప్పనిసరిగా సైన్యంలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం పై తీవ్రస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సింగపూర్‌తో పాటు మరికొన్ని దేశాలు తమ తమ దేశాల్లోని యువతీ యువకులకు ఆరు నెలలు లేదా ఏడాది కాలం పాటు సైనిక శిక్షణను ఇస్తున్నాయి. ఈ శిక్షణ ద్వారా యువతలో క్రమశిక్షణ, దేశభక్తి పెరగడంతో పాటు విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడుకోవాలనే అంశంపై సైతం అవగాహన ఏర్పడుతుంది.

మిలిటరీ క్రమశిక్షణ
మానవత్వం మంట కలుస్తోంది. మానవ సంబంధాల పట్ల విలువలు తగ్గుతున్నాయి. జనారణ్యంలో ముసుగులు వేసుకుని తిరుగుతున్న మానవ మృగాలు.. ఉన్మాదంతో ఊగిపోతున్నాయి. అమాయక ఆడపిల్లల ఉసురుతీసి ఊరేగుతున్న యువత సన్మార్గంలో నడవాలంటే మిలిటరీ క్రమ శిక్షణ అలవరచుకోవాలి.

ఆదర్శవంతమైన పౌరులు
తల్లిదండ్రులు ఉగ్గుపాలతో దేశభక్తిని రంగరించి పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి. దేశభక్తి కలిగిన ఆదర్శవంతమైన పౌరులుగా యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇలా పెరిగిన పిల్లలు మాత్రమే పెద్దయ్యాక తమ తల్లిదండ్రులను అపురూపంగా చూసుకుంటారు. దేశం కోసం పరితపించే వారిలోనే నైపుణ్యాలు, శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. దేశభక్తి కలిగిన పౌరుడు కుటుంబ విలువలను గుర్తిస్తాడు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో జాతీయ భావాలు పెంపొందించడం ద్వారా వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కుటుంబ పెద్దలు కృషిచేయాలి. మనుషులు ప్రవర్తించే తీరు ఒక్కొక్కరిది ఒక్కోరకంగా ఉంటుంది. మనుషుల ప్రవర్తన తీరును బట్టి వారి యొక్క పర్సనాలిటీ గుర్తించబడుతుంది. సమాజం ఆమోదించని మనుషులలోని ప్రవర్తనలను బట్టి వ్యక్తిత్వలోపాలు ఏర్పడుతాయి. వ్యక్తిత్వలోపాలను సరిదిద్దుకోగలిగితే భవిష్యత్తు సమాజం నందనవనంలా తయారవుతుంది. భారతదేశంలోని యువత ‘‘మంచి వ్యక్తిత్వం వైపుకు అడుగులు……’’ వేయడానికి మిలిటరీ కల్చర్‌ ఎం‌తగానో దోహదం చేస్తుంది. మిలిటరీ కల్చర్‌ ఇతరులను అభినందించడం, తమపై ఇతరుల పై నమ్మకాన్ని కలిగిఉండడం, తను చేసే పనిలో అంకితభావం,నీతి నిజాయితీ గా ఉండడం. ఇతరులతో గౌరవంగా మెలగడం వంటి అలవాట్లను మెరుగు పరుచుకోవడం నేటి పిల్లలు, యువతకు ఎంతో అవసరం.

– డా. అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్

 

Leave a Reply