Take a fresh look at your lifestyle.

హుజూరాబాద్‌లో మైకులు బంద్‌..‌ ముగిసిన ఎన్నికల ప్రచారం

ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి..30న పోలింగ్‌
కరీంనగర్‌ ‌జిల్లా హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలో ప్రచారం బుధవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. మూడు, నాలుగు నెలలుగా మారు మోగిన మైకులు మూగపోయాయి. కొరోనా నేపథ్యంలో పోలింగ్‌ ‌మొదలవడానికి 72 గంటల ముందు ప్రచారం ఆపేయాల్సి ఉంది. ఇక ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 30న పోలింగ్‌ ‌జరగనుంది. దీంతో పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ఆగిపోయింది. హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలో 306 పోలింగ్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేశారు. 47 పోలింగ్‌ ‌కేంద్రాల్లో వెయ్యి కంటే ఎక్కువ వోటర్లు ఉన్నారు.

వయోవృద్ధులకు, దివ్యాంగులకు, కొవిడ్‌ ‌రోగులకు పోస్టల్‌ ‌బ్యాలెట్‌ ‌సౌకర్యం కల్పించనున్నారు. హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలో మొత్తం 2,36,859 మంది వోటర్లు ఉన్నారని, ఇందులో పురుష వోటర్లు 1,17,768, మహిళ వోటర్లు 1,19,090 మంది ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ ‌వోటర్లు 14 మంది ఉండగా, సర్వీస్‌ ‌వోటర్లు 149, పీడబ్ల్యు వోటర్లు 8,246, ట్రాన్స్ ‌జెండర్‌ ఒకరు ఉన్నారు. 18-19 ఏండ్ల వోటర్లు 5,165 మంది ఉండగా, 80 ఆపై వయస్సున్న వోటర్లు 4,454 మంది ఉన్నారు.

Leave a Reply