Take a fresh look at your lifestyle.

గుజరాత్ నుంచి కాలి నడకన స్వస్థలాలకు వలస కార్మికులు 

గుజరాత్ నుంచి కాలి నడకన స్వస్థలాలకు వలస కార్మికులు  
 అహ్మదాబాద్: కరోనావైరస్ వ్యాప్తి అరికట్టడానికి  21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో, గుజరాత్ లో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న రాజస్థాన్ నుంచి  వేలాది మంది వలస కార్మికులు ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో తిరిగి తమ స్వస్థలాలకు కాలి నడక ప్రయాణానికి  ప్రయత్నం చేస్తున్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడి వారు అక్కడ ఉండాలని చేసిన విజ్ఞప్తికి కట్టుబడి ఉండాలని గుజరాత్ పోలీసులు వలస కార్మికులకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా గాని వలస కార్మికులు బ్రతికుంటే బలుసాకు తిని బ్రతుకుతాం అంటూ స్వస్థలాలకు కాలినడకన ప్రయాణిస్తున్నారు  రాజస్థాన్‌ దుంగార్‌పూర్ జిల్లాకు చెందిన, రాధే శ్యామ్  పటేల్  అహ్మదాబాద్‌లో పని చేస్తున్నరు.  పటేల్ మాట్లాడుతూ “ఆదాయం లేకుండా గుజరాత్ లో ఉండటం ఎలా కుదురుతుంది అని అడుగుతున్నారు. రాధేశ్యామ్ పటేల్ 50 మంది సభ్యుల బృందంగా మంగళవారం రాత్రి నుండి కాలినడక సొంత గ్రామానికి పయనం అయ్యారు.
 *కరోనా వైరస్ ముప్పు ఉందని నాకు తెలుసు, మేము నిస్సహాయులం.. మూడు వారాల పాటు ఎటువంటి ఆదాయం లేకుండా ఎలా బ్రతకాలి? ఇంటి ఓనరుకి చెల్లించడానికి నా దగ్గర డబ్బు లేదు.అందుకే సొంత ఊరుకు  తిరిగిపోతున్నా” అని  రాజస్థాన్ ఉదయపూర్ జిల్లాకు చెందిన మంగీ లాల్ అన్నారు. గుజరాత్ మెహ్సానా జిల్లా నుండి రాజస్థాన్ లోని సొంత గ్రామానికి కాలి నడకన తిరిగి బయలుదేరిన  100 మంది బృందంలో మంగీ లాల్ ఒకరు.*
 *చాలా మంది వలస కూలీలు సూరత్ నుంచి కూడా కాలినడకన తమ ప్రయాణాన్ని ప్రారంభించారు, ఇలా ఎందుకు జరుగుతోంది అంటే.. వలస కార్మికులు పని చేస్తున్నా ఫ్యాక్టరీలు లాక్ డౌన్ వల్ల మూతబడ్డాయి. దీనితో వలస కార్మికుల ఉద్యోగాలు ఫ్యాక్టరీ యజమానులు తీసేసారు. మరోవైపు ఇంటి ఓనర్లు ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తున్నారు అని  పంజాబీ అనే వలస కార్మికురాలు చెప్పింది.*

Leave a Reply