- గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ ద్వారా ఉపాధి
- రూ. 50కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
- లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని మోడీ
వలస కూలీల కోసం గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ పథకాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. బీహార్‌లోని కగరియా జిల్లాలో ఉన్న తెలిహర్ గ్రామం నుంచి వీడియోకాన్పరెన్స్ ద్వారా ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంతో 125 రోజుల ఉపాధి కల్పించనున్నారు. ఆరు రాష్ట్రాలకు చెందిన 116 జిల్లాల్లో ఈ పథకం ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పంచనున్నారు. ఇందుకోసం 50వేల కోట్లు కేటాయించారు. కరోనా వైరస్‌తో ఏర్పడిన లాక్డౌన్ వల్ల తమ స్వస్థలాలకు వచ్చిన వలస కూలీల కోసం ఈ ఉపాధి హా పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాల్వన్ లోయలో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు.. ప్రమాణామాలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. సైనికుల వెంట దేశ ప్రజలు ఉన్నారన్నారు. బీహార్ రెజిమెంట్ పట్ల గర్వంగా ఉందన్నారు. కరోనా సమయంలో ప్రజలంతా తమ స్వగ్రామాలకు తరలి వచ్చారని వారికి ఉపయుక్తంగా ఉన్నచోటే పని కల్పించాలని నిర్ణయించామని అన్నారు. అలాగే వారి సహనానికి అభినందనలు తెలిపారు. వారికి పనిద్వారా ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కరోనా జాగ్రత్తలు విస్మరించ రాదని, మాస్కుఉల తప్పకుండా ధరించాలని మరోమారు ప్రధాని మోడీ సూచించారు. అలాగే భౌతికదూరం పాటిస్తూ ముందుకు సాగాలన్నారు.
లాక్డౌన్ సమయంలో స్వంత గ్రామాలకు వచ్చిన వలస కూలీలు తమ స్వస్థలాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. అయితే అలాంటి కూలీలకు ఈ పథకం ఎంతో ఉపకరిస్తుందని ఆయన అన్నారు. వలస కార్మికుల సంక్షేమం కోసం గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ పథకాన్ని ప్రారంభించిన మోదీని నితీశ్ మెచ్చుకున్నారు. 125 రోజుల పనిదినాల్లో.. 25 రకాల ప్రజాపనులను చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. కోవిడ్19 వల్ల స్వంత ప్రదేశాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు ఈ పథకం కింద అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రధాని ప్రకటించారని, ఆ ప్యాకేజీతో ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదు అని, వ్యవసాయం, గ్రామాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తోమర్ తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో వలస కూలీలుగా పనిచేసి.. తిరిగి స్వంత రాష్ట్రానికి చేరుకున్న కొంత మంది కూలీలు ప్రధాని మోదీతో వీడియోకాన్ఫరెన్స్‌లో తమ అనుభవాలను పంచుకున్నారు.