Take a fresh look at your lifestyle.

వలస కార్మికులను.. ఆదుకోని సంస్థలు

  • ముందే ముప్పు గుర్తించని య•మాన్యాలు
  • వారు మళ్లీ కావాలనుకుంటే వస్తారా?

కరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందుతూ ఉండటం వలన మన దేశంలో లాక్‌డౌన్‌ ‌ప్రకటించాక బాగా నష్టపోయింది వసల కార్మికులే. తిరిగి వారిని రప్పించేందుకు ఇప్పుడుకొందరు నానా తంటాలు పడుతున్నారు. ఎక్కడి సంస్థలక్కడే మూతబడి పోవడంతో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ‌పనులు ఆగిపోయినాయి. ఎవరూ ఎక్కడికీ కదలటానికి వీలు లేకుండా పోయింది. కానీ ఆయా సంస్థలలో, ప్రాజెక్ట్ ‌పనులలో నిత్యం పని చేస్తున్న కూలీలు వందల…వేల మంది నిరాశ్రయులు, నిరాధారులు అయినారు. వారి గురించి పట్టించుకోకుండా, కనీసం వారి స్థితిగతుల గురించి ఆలోచించకపోవటం వల్ల తీవ్ర నస్టాలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆయా సంస్థలు, ప్రాజెక్టుల యాజమాన్యాల బాధ్యతా రాహిత్యం, అమాన వీయత అనాలి.

వలస కార్మికులతో పనిచేయించుకున్న ఆయా సంస్థలు ఆయా ప్రదేశాలలోనే సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు ఆశ్రయం, ఆహారం, ఆరోగ్యం…వంటి అత్యవసర సదుపాయాలు కలుగజేసి ఉంటే దేశంలో ఇప్పుడు ఈ పరిస్తితి ఉత్పతన్నం అయ్యేద ఇకాదని కార్మిక సంఘాల నేతలు అన్నారు. ఇన్నాళ్లూ వారితో పనిచేయించుకుని లాక్‌డౌన్‌తో వారిని గాలికి వదిలేయడం వల్లనే దేశంలో సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. చర్యలు తీసుకుని ఉంటే వలస కార్మికులందరూ జీవన్మరణ పరిస్థితులలో వేల మైళ్ళు నడిచి వారి ప్రాంతాలకు పయనమయ్యేవారు కాదు. భయంకర కష్టనష్టాలను ఎదుర్కొనేవారు కాదు. నిబంధనల కంచెలను దాటేందుకు ప్రయత్నించేవారు కాదు. ఆలస్యంగా మేలుకున్న ప్రభుత్వాలు, నాయకులు, స్వచ్ఛంద సంస్థలు స్పందించిన వారు సొంతూళ్లుకు పయనమయ్యారు. సోనూ సూద్‌ ‌వంటి హీరోలు…తగిన ఏర్పాట్లు చేసి వారందరినీ వారివారి ప్రాంతాలకు తరలించారు. తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడి, ఆయా కర్మాగారాలు, ప్రాజెక్ట్ ‌నిర్మాణాల పనులు ప్రారంభించాలంటే… వారికి కావలసిన నైపుణ్య, నైపుణ్య రహిత కార్మికులు ఎక్కడ నుంచి వస్తారన్నది ఆలోచన చేయలేదు. పనులు ఎలా ప్రారంభిస్తారు? ఎలా కొనసాగిస్తారు? ఎవరైనా ఆలోచించారా? అప్పుడు మరలా కొత్త సమస్యలను కొని తెచ్చుకొని ప్రజలను హింసిస్తారా అన్నది చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!