– మైక్రోసాప్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల వెల్లడి
బెంగుళూరు, డిసెంబర్ 11: భారత్‌లోని కృత్రిమ మేధ వ్యవస్థకు తగిన రీతిలో మైక్రోసాప్ట్ సంస్థ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు మైక్రోసాప్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థను కూడా మైక్రోసాప్ట్ మరింత పటిష్టం చేసేందుకు పనిచేస్తున్నట్లు చెప్పారు. బెంగుళూరులో గురువారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.లక్షలాది మంది భారతీయులకు కృత్రిమ మేధపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. భారత్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు. ఉత్తమైన మౌలిక సదుపాయాల్ని కల్పించనున్నట్లు చెప్పారు. సుమారు 17.5 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆసియా ఖండంలోనే మైక్రోసాప్ట్‌కు చెందిన అత్యంత భారీ పెట్టుబడి ఇదేనని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా క్లౌడ్ ప్లాట్‌ఫామ్ విస్తృతంగా వ్యాపిస్తున్నట్లు మైక్రోసాప్ట్ చైర్మన్ తెలిపారు. అజూర్ కంప్యూటర్ వ్యవస్థపై వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 70 కన్నా ఎక్కువ సంఖ్యలో డేటా సెంటర్లు ఉన్నాయన్నారు. భారత్‌లోనూ మైక్రోసాప్ట్ సెంటర్లు పెరుగుతున్నట్లు చెప్పారు. గిట్ హబ్‌లో 2030 నాటికి ఇండియా నెంబర్ వన్‌గా మారుతుందని ఆయన అంచనా వేశారు. భారత్‌లో జియోతోనూ భాగస్వామ్యం ఉందన్నారు. 2026లో కొత్త డేటా సెంటర్ ప్రాంతం ఆపరేషనల్‌గా మారనున్నట్లు నాదెళ్ల చెప్పారు. దక్షిణ మధ్య భారతంలో కొత్త డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై సుమారు రెండు కోట్ల మంది భారతీయులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు నాదెళ్ల తెలిపారు. ప్రభుత్వానికి చెందిన ఈ`శ్రమ్ ప్రోగ్రామ్ ద్వారా అసంఘటిత కార్మికులను ఏఐతో చైతన్యపరచవచ్చునన్నారు. భారత్‌లోని ప్రతీ వ్యక్తిని, ప్రతీ సంస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



