- 7న ఎంజిబిఎస్-జెబిఎస్ కారిడార్ ప్రారంభం మంత్రి కెటిఆర్ ట్వీట్
నగర వాసులకు శుభవార్త. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కిలోటర్ల మేర మెట్రో ప్రయాణం అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న కారిడార్-2ని.. సీఎం కేసీఆర్ చేతులమిదుగా ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 7న సాయంత్రం 4 గంటలకు జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో లైన్ను సీఎం కేసీఆర్ చేతుల దుగా ప్రారంభించనున్నట్టు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 9 స్టేషన్లు నిర్మించారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే.. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వెళ్లడానికి కేవలం 16 నిమిషాల సమయం మాత్రమే పట్టనుంది. రెండు అతిపెద్ద బస్టాండులను లింక్ చేస్తూ నిర్మించిన జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ నగర వాసుకే కాకుండా.. జిల్లాలు, ఇతర రాష్టాల్ర నుంచి హైదరాబాద్ వచ్చే వారికి ఎంతో ఉపయోగపడనుంది. కాగా.. ఈ లైన్ నిర్మాణం, ట్రయల్ రన్ పూర్తి చేసుకుని మెట్రోరైలు భద్రతా శాఖ నుంచి 20 రోజుల క్రితమే అనుమతులు పొందింది. నాగోల్-హైటెక్ సిటీ కారిడార్ 29 కిలోటర్లు, మియాపూర్ -ఎల్బీ నగర్ కారిడార్ 29 కిలోటర్లు ప్రస్తుతం మెట్రో రైలు నడుస్తుండగా మూడో కారిడార్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 15 కిలోటర్ల వరకు అందుబాటులోకి రానుంది.
దీంతో మొత్తం 72 కిలోటర్ల నగరంలో మెట్రో రైలు పరుగులు పెడుతుంది. రెండు అతిపెద్ద బస్టాండులను లింక్ చేస్తూ నిర్మించిన జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ హైదరాబాద్ వాసుకే కాకుండా.. జిల్లాల నుంచి, ఇతర రాష్టాల్ర నుంచి వివిధ పనుల కోసం హైదరాబాద్ వచ్చే వారికి ఎంతో ఉపయోగపడనుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీంతో హైదరాబాద్ మెట్రో కారిడార్ 67 కిలోటర్ల మేర పూర్తవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అర్ పేట్ తరహా అతిపెద్ద ఇంటర్చేంజ్ స్టేషన్ ఈ కారిడార్లో ఎంజీబీఎస్ వద్ద ఉంది. తాజాగా మరింత మెట్రో మార్గం అందుబాటులోకి రానుండడంతో నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.