అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరంలో మెట్రో రైల్ సేవల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. శానిటైజర్లను వినియోగించాలి. మెట్రో రైల్ సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తరువాతనే ప్రయాణికులను స్టేషన్‌లోనికి అనుమతిస్తారు. ఈ నిబంధనలకు మెట్రో రైల్ సిబ్బంది అధికారులు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం మార్గదర్శకాలలో స్పష్టం చేసింది. కాగా, మొదటి దశ మెట్రో సేవలు ఈనెల 7 నుంచి ప్రారంభమవుతాయి.
కారిడార్ 1లో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ప్రయాణికులను అనుమతిస్తారు. రెవెన్యూ సేవలు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 వరకు కొనసాగుతాయి. ఇక రెండో దశ మెట్రో సేవలు ఈనెల 8 నుంచి అందుబాటులోకి వస్తాయి. దానిలో భాగంగా కారిడార్ 3 నాగోల్ నుంచి రాయదుర్గం మెట్రో సేవలను ప్రారంభమవుతాయి. ఇక మూడవ దశలో భాగంగా మెట్రో సేవలు సెప్టెంబర్ 9 నుంచి అందుబాటులోనికి రానున్నాయి. ఇందులో భాగంగా మూడు కారిడార్లలోని సీ1, సీ2, సీ3 మెట్రో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. దీంతో ప్రతీ నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. రైళ్ల సంఖ్యను పెంచడం అనేది ప్రయాణికుల రద్దీ ఆధారంగా నిర్ణయిస్తారు. ఇక కంటైన్మెంట్జోన్లలోని స్టేషన్లను ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. అలాగే, గాంధీ హాస్పిటల్, భరత్‌నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసుఫ్‌గూడ స్టేషన్ల మూసివేత కూడా యధావిధిగా కొనసాగనుంది.