Take a fresh look at your lifestyle.

జర్నలిస్ట్ ‌ప్రియా రమణి నిర్దోషి

ప్రకటించిన ఢిల్లీ కోర్టు..ఎంజె అక్బర్ ‌కు చుక్కెదురు
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ: మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ ‌మీ టు ఉద్యమంలో భాగంగా తన పరువు పొయిందంటూ జర్నలిస్ట్ ‌ప్రియా రమణి మీద వేసిన పరువు నష్టం క్రిమినల్‌ ‌కేసులో జర్నలిస్ట్ ‌ప్రియా రమణిని ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దశాబ్దాల క్రితం జర్నలిస్టుగా ఉన్నప్పుడు ఎంజే అక్బర్‌ ‌తనపై లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడని ఆరోపించిన ప్రియా రమణి, తన పరువు తీశారనే ఆరోపణలతో ఎంజె అక్బర్‌ 2018 అక్టోబర్‌ 15‌న జర్నలిస్ట్ ‌ప్రియా రమణిపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై ఢిల్లీ కోర్టు దశాబ్దాల తరువాత కూడా ఒక మహిళ తన ఫిర్యాదులను కోర్టుకి చెప్పే హక్కు ఉందని పేర్కొనడంతో ఎంజే అక్బర్‌కి చుక్కెదురయింది. బుధవారం పరువు నష్టం క్రిమినల్‌ ‌కేసులో ప్రియా రమణిని ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ‘‘మీరు ప్రస్తుత కేసులో నిర్దోషులుగా ఉన్నారు’’ అని కోర్టు ప్రియా రమణికి తెలిపింది. ఈ ఉత్తర్వులను కోర్టు చదివి వినిపిస్తూ ఇటువంటి ఆరోపణ చేసే మహిళ సామాజిక కళంకాలులు ఎదుర్కోవలసి వొస్తున్నదని కోర్టు వ్యాఖ్యానించింది.

లైంగిక వేధింపులు..వాటి ప్రభావం బాధితులపై ఎలా ఉంటుందనేది సమాజం అర్థం చేసుకోవాలని కోర్టు అంది. ‘‘ఒక మహిళకు తన మనోవేదనను దశాబ్దాలు గడిచిన తరువాత కూడా బహిరంగా చెప్పే హక్కు ఉంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. కేసును విచారణ చేసిన ఢిల్లీ కోర్టు ప్రియా రమణిపై చేసిన ఆరోపణల తరవాత ఎంజే అక్బర్‌ ‌పరువు నష్టం కలిగిందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ట్వీట్ల వలన ఎంజె అక్బర్‌ను పరువు తీసినట్లయ్యిందని కోర్టు తెలిపింది. అయితే అక్బర్‌ ‌పేరు ప్రఖ్యాతి గడించిన వ్యక్తి అని.. అతను ఇలాంటి వివాదంలో పడటం వలన అతని పరువుకు నష్టం వాటిల్లదని ఇందులో జర్నలిస్ట్ ‌ప్రియా రమణిని భాధ్యురాలిని చేయలేమని కోర్టు పేర్కొంది. కోర్టు వర్క్ ‌ప్లేస్‌లో లైంగిక వేధింపులు ఓ పథకం ప్రకారం కొనసాగుతున్నాయని, దీని చుట్టూ సామజిక కళంకాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.

‘‘సామాజిక హోదా ఉన్న వ్యక్తి కూడా లైంగిక వేధింపుదారుడు కావొచ్చు. ఆ వ్యక్తి గౌరవం అనే హక్కు వాడుకుంటే కోర్టు అతని ‘కీర్తి హక్కును’ రక్షించలేదు’’. అని కోర్టు తెలిపింది. కోర్టు ప్రకటన తరువాత, ప్రియా రమణి విలేకరులతో మాట్లాడుతూ, ‘‘ఈ యుద్ధం మహిళల కోసం జరిగింది, ఇది కేవలం నా కేసు కాదు. ఇటువంటి కేసుల గురించి మాట్లాడిన మహిళలందరికీ, నా కేసుకి ముందు మాట్లాడిన స్త్రీలకు, నా కేసు తర్వాత మాట్లాడిన మహిళలందరికీ ఈ విజయం చెందుతుంది. ఇది చాలా సముచితమైన తీర్పు అనుకుంటున్నాను. నా విజయం ఖచ్చితంగా ఎక్కువ మంది మహిళలను మాట్లాడటానికి ప్రోత్సహిస్తుంది. శక్తివంతమైన పురుషులు బాధిత మహిళలను కోర్టుకు తీసుకెళ్లేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేస్తుంది. ఈ కేసులో నన్ను నేరస్తురాలుగా చూసారని మర్చిపోవద్దు. మాట్లాడినందుకు నాపై ఆరోపణలు వొచ్చాయి’’ అని అన్నారు.

Leave a Reply