గనుల్లోకి నీరు చేరడంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
రాష్ట్రంలో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోవి•టర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్లో బుధవారం తెల్లవారుజాము నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. ఉప్పల్, అల్వాల్, రాజేంద్రనగర్, కార్వాన్ ఏరియాల్లో ఉదయం 10 గంటల వరకు 0.5 మి.వి•. నుంచి 2 మి.వి•. మధ్య వర్షపాతం నమోదైంది. బాచుపల్లిలో ఉదయం 10 గంటలకు భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది జులై 20 నాటికి సాధారణ వర్షపాతం కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది. మంగళవారం వరకు నగరంలో 70 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.
జులై 20వ తేదీ వరకు 359.5 మి.వి•. వర్షపాతం నమోదు అయింది. ఈ తేదీ వరకు సాధారణ వర్షపాతం 210.9 మి.వి•. మాత్రమే. ఐఎండీ డాటా ప్రకారం.. జులైలో నెలలో 285.2 మి.వి•. వర్షపాతం నమోదు కాగా, గత పదేళ్లలో ఇదే అత్యధికమని వెల్లడించింది. ఇదిలావుంటే మంచిర్యాల, భదాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ఉపరితల గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. మంచిర్యాల పరిధిలో కేకే, ఆర్కేపీ, ఎస్ఆర్పీ, ఇందారం ఉపరితల గనుల్లో ఉత్పత్తికి ఆటంకం కలిగింది. వర్షం నీరు చేరడంతో 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, పినపాకలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షంతో ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లో పనులకు ఆటంకం ఏర్పడింది. 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 28 వేల క్యూబిక్ వి•టర్ల మట్టి వెలికితీతకు అంతరాయం కలిగింది. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, కరకగూడెం, గుండాల, ఆలపెల్లిలో భారీ వర్షం కురిసింది. మణుగూరు ఉపరితల గనుల్లో పనులకు అంతరాయం ఏర్పడింది. భదాద్రి విద్యుత్ ప్లాంట్ 4వ యూనిట్ సివిల్ వెల్డింగ్ పనులకు ఆటంకం కలిగింది.