Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం

  • మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లోకి చెరుకు
  • చెరుకు రాకపై తీవ్రంగా మండిపడ్డ వెంకట్‌ ‌రెడ్డి
  • పార్టీ నుంచి వెళ్లగొట్టేలా రేవంత్‌ ‌చర్యలున్నాయని ఆరోపణ
  • రేవంత్‌ ‌ముఖం చూసేది లేదని ప్రతిజ్ఞ

న్యూ దిల్లీ, ఆగస్ట్ 5 : ‌తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్‌ ‌పార్టీలో విలీనమైంది.  కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ‌ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ ‌శుక్రవారం కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే చెరుకు సుధాకర్‌ ‌చేరికను ఎంపికోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే తమ్ముడితో కలిపి తనపై రేవంత్‌ ‌విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో చెరుకు సుధాకర్‌ ‌చేరికపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ వి•డియాతో మాట్లాడుతూ…టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పెద్దతప్పు చేశారని విమర్శించారు.

తనను ఓడించాలనుకున్న వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఇకపై రేవంత్‌రెడ్డి ముఖం చూడనని అన్నారు. పార్లమెంట్‌ ‌సమావేశాల తర్వాతే మునుగోడుకు వెళ్తానని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. వి•డియా ప్రశ్నలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అలాగే వెంకట్‌రెడ్డి తీరుపై కూడా వి•డియా ప్రతినిధులు మండిపడ్డారు. పనికిరాని మునుగోడు గురించి అడుగుతున్నారని బాధగా ఉందని వెంకట్‌రెడ్డి అన్నారు. వరద సాయం గురించి ఇప్పటివరకు ఎవరూ ప్రస్తావించలేదన్నారు. ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్‌ ‌కూడా కోరానన్నారు. గుజరాత్‌ ‌తర్వాత.. తెలంగాణాయే ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్‌ ‌చెప్పారని, ఇప్పుడు పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి పడిపోయిందని విమర్శించారు. రాష్ట్రం ఇలా ఉన్నప్పుడు.. సీఎం కేసీఆర్‌ ‌వరద బాధితులకు ఇంకేం సాయం చేస్తారని ప్రశ్నించారు. రేవంత్‌ ‌రెడ్డి గురించి తాను మాట్లాడనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.

పార్టీ నుంచి వెళ్లగొట్టేలా రేవంత్‌ ‌చర్యలు : కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి
కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై వెంకట్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కాంగ్రెస్‌ ‌పార్టీని ఆయన ఏం చేద్దామనుకుంటున్నారని నిలదీశారు. రేవంత్‌ ఎవరినీ సంప్రదించకుండా చెరుకు సుధాకర్‌ ‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడాన్ని వెంకట్‌ ‌రెడ్డి తప్పుబట్టారు. పాత టీడీపీ వాళ్లందరినీ రేవంత్‌ ‌కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాసోజు శ్రవణ్‌ ఎం‌దుకు పార్టీ వీడాల్సి వొస్తుందని ప్రశ్నించిన ఆయన.. రేవంత్‌ ‌వ్యవహరిస్తున్న తీరు గురించి సోనియా, రాహుల్‌ ‌గాంధీ వద్ద తేల్చుకుంటానని స్పష్టం చేశారు. మునుగోడులో కాంగ్రెస్‌ ‌సభ నిర్వహించడంపై కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఫైర్‌ అయ్యారు.

తనకు ఈ రోజు పార్లమెంటులో మూడు క్వశ్చన్లు ఉన్నాయని, తాను రాలేనని తెలిసే మునుగోడులో సభ ఏర్పాటు చేశారని ఆరోపించారు. లోకల్‌ ఎం‌పీనైన తనను సంప్రదించకుండా మునుగోడులో సభ ఎలా పెడతారని వెంకట్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు తెలుసన్న వెంకట్‌ ‌రెడ్డి..హుజూరాబాద్‌ ‌విషయంలో రేవంత్‌ ఎం‌దుకు ఇలా రియాక్ట్ అవలేదని అన్నారు. అంతకు ముందు కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా జరిగిన వరద నష్టంపై చర్చించారు. వరదల కారణంగా దాదాపు రూ.1400 కోట్ల నష్టం జరిగిందని, తెలంగాణలో ఏరియల్‌ ‌సర్వే చేయించాలని కోరినట్లు వెంకట్‌ ‌రెడ్డి చెప్పారు.

Leave a Reply