- నడుపుతామనుకున్న వారు నడుపుకోవచ్చు
- విద్యాసంస్థలపై ఎలాంటి ఒత్తిడి లేదన్న అధికారులు
విశాఖపట్నం,నవంబర్ 12 : ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం యాజమాన్యాల ఇష్టమేనని, విద్యాసంస్థలపై ఎటువంటి ఒత్తిడి లేదని ఎయిడెడ్ యాజమాన్యాల సమావేశంలో వివిధ జిల్లా కలెక్టర్లు తెలిపారు. ఎయిడెడ్‌పై పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విశాఖ, గుంటూరు, ఒంగోలు, తిరు పతి, శ్రీకాకుళం, కర్నూలు, ఒంగోలులో సమావేశాలు నిర్వహించారు. విద్యాసంస్థలను ప్రభుత్వానికి అప్పజెప్పడం.. చెప్పకపోవడమూ యాజమాన్యాల ఇష్టమేనని వారు తెలిపారు. విద్యా సంస్థలు, విద్యార్థుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకుంటాం తప్ప, ఎటువంటి ఒత్తిడి ఉండదని విశాఖ కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు ఎటువంటి మార్పులు ఉండవన్నారు. అంగీకారం తెలిపిన పాఠశాలలోని విద్యార్థులకు అసౌ కర్యం లేకుండా దగ్గరలోని పాఠశాలల్లో చేర్పించ నున్నట్లు తెలిపారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు కలుగనీయమని, ఆందో ళన చెందవద్దని పేర్కొన్నారు.
ఇప్పటికే అంగీకారం తెలిపిన ఎయిడెడ్ విద్యాసంస్థలు పునరాలోచించు కొని వారి నిర్ణయాన్ని తెలియజేవచ్చన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రచారం కోసం ఎటువంటి వ్యాఖ్య లు చేసినా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. పాఠశాలల్లో పిల్లలు లేని చోట ప్రభుత్వంలో కలపాలని ప్రభుత్వానికి దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చిందని శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ చెప్పారు. ప్రభుత్వంలో ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యం విలీనానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. పలాస డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ.. కళాశాలను స్వయంగా నడిపించుకుంటామని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, దరఖాస్తు చేసుకోవా లని కలెక్టర్ సూచించారు. కర్నూలు జిల్లాలో 119 ఎయిడెడ్ ప్రాధమిక పాఠశాలలు, 14 ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాలలు, 39 ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలు ఉండగా ఇందులో 92 ఎయిడెడ్ పాఠశాలలు ప్రభుత్వంలో విలీనం చేయడానికి ముం దుకు వచ్చాయనిజిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు తెలిపారు.
గుంటూరు జెసి రాజకుమారి మాట్లాడు తూ.. పాఠశాలల విలీనంపై ఎటువంటి వత్తిడి లేదు. పూర్తిగా ఇష్టమైతైనే అప్పగించాలన్నారు. యాజమా న్యాలు అంగీకారం తెలిపిన ఎయిడెడ్ విద్యా సంస్థలు మాత్రమే ప్రభుత్వంలోకి విలీనమవుతాయని ఒంగోలు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎయిడెడ్ విద్యా సంస్థలు విలీన ంపై ప్రభుత్వం జారీ చేసిన జిఒ నంబర్ 50లోని అంశాలను వివరించారు. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే సంబంధిత విద్యా సంస్థల యాజమాన్యం ఏ సమయంలోనైనా కలెక్టరేట్‌కు రావచ్చన్నారు.