Take a fresh look at your lifestyle.

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

చెట్టుకు ఉరివేసుకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గుండ్రపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. నెక్కొండ ఎస్‌ఐ ‌జుబ్బురు నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని కనపర్తి రమేష్‌ ‌వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి తునికి చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

బుధవారం గుర్తించిన రమేష్‌ ‌పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుని దగ్గర ఎలాంటి ఆధారాలు లాభించలేదని అతని వయస్సు సుమారుగా 40 నుండి 45 సంవత్సరాల లోపు ఉంటుందని తెలిపారు. గ్రామ విఆర్వో యాకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply