Take a fresh look at your lifestyle.

గొలనుకొండలో వ్యక్తి దారుణ హత్య

ఆలేరు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గొలనుకొండ గ్రామానికి చెందిన కంతిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి (40)ని సోమవారం జనగాం జిల్లా లింగాల గణపురం మండలంలోని సిరిపురం గ్రామ శివారులో గొలనుకొండ గ్రామానికి చెందిన దానబోయిన పరుషరాములు దారుణంగా హత్య చేశారు.  వెంకటరెడ్డి ఇంటిలో జరగనున్న శుభకార్యానికి సంబంధించిన వస్తువుల ను కొనుగోలు చేయదనికి  తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై జనగాంకు వెళుతుండగా పరుశరాములు ఒక్కసారిగా వెంకటరెడ్డిపై దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆలేరు పోలీస్‌ ‌స్టేషన్‌ ‌లో తనంతట తాను లొంగిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు మంగళవారం ఉదయం నిందితులు పరు శరాములు ఇంటిపై వెళ్లి దాడి చేసి ఇంటికి  నిప్పంటించారు. విషయాన్ని తెలుసుకున్న ఏసిపి కోట్ల నరసింహరెడ్డి, యాదగిరిగుట్ట సర్కిల్‌ ఇన్స్ ‌పెక్టర్‌ ‌నరసయ్య, ఆలేరు సబ్‌ ఇన్సిపెక్టర్‌ ‌రమేష్‌, ‌హుటాహుటిన గ్రామానికి చేరుకోగా అప్పటికే కోపోద్రిక్తులైన గ్రామస్తులు పోలీస్‌ ‌లతో వాగ్వివాదానికి దిగారు. పోలీసులు గ్రామస్తులను శాంతిం పజేసి నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.

Tags: aleru murder, golanukonda village,katti reddy venkatreddy murder

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply