Take a fresh look at your lifestyle.

‘మేము’ ఈ తరం సమానం

“విప్లవాలు లేకపోతే మహిళలకు విముక్తి లేదు, అలాగే మహిళలు లేనిదే విప్లవాలు లేవు. ఈ సార్వత్రిక సూత్రం వెలుగులో, బీజింగ్‌ ‌డిక్లరేషన్‌ ‌స్ఫూర్తితో చారిత్రక, సామాజిక మార్పు ఉద్యమాలను నిర్వహిస్తున్నారు. 2003లో లైబీరియా మహిళలు తమ దేశంలో 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం నివారించడానికి సెక్స్‌స్ట్రైక్‌ను నిర్వహించి మగవారిలో పరివర్తన తెప్పించారు. ఫలితంగా ప్రాణనష్టం, ఆస్తుల విధ్వంసంతో కల్లోలమైన లైబీరియాలో అంతర్యుద్ధం ముగిసి శాంతిస్థాపన జరిగింది. ఎల్లెన్‌ ‌జాన్సన్‌ ‌సర్‌లీఫ్‌ అనే మహిళ దేశాధినేతగా ఎన్నికయ్యారు. వేతన వ్యత్యాసాలు తొలగించాలని ఐస్‌లాండ్‌ ‌మహిళలు ఆర్థిక, ఉత్పాదక, గృహ సంబంధ పనులలో పాల్గొనకుండా సమ్మెను నిర్వహించారు.”

Asnaala Srinivas
అస్నాల శ్రీనివాస్‌
‌తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం.
9652275560

స్త్రీల హక్కులు తెలుసుకుందాం అనే ఇతివృత్తంతో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకోవాలని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం పిలుపు నిచ్చింది. స్త్రీల సాధికారత కొరకు నిర్వహించిన సదస్సులలో 1995లో బీజింగ్‌లో నిర్వహించిన నాల్గవ ఐక్యరాజ్యసమితి మహిళసదస్సు వెలువరించిన జీజింగ్‌ ‌డిక్లరేషన్‌, ‌కార్యాచరణ ప్రణాళికకు 25వ వార్షికోత్సవంను పురస్కరించుకొని మహిళ హక్కులు – లింగ సమానత్వంలో సాధించిన పురోగతిని తెలియచేసే చర్యలు, సమీక్ష సభలు నిర్వహించాలని సభ్య దేశాలని కోరింది. ‘‘ నూతన తరానికి చెందిన స్త్రీలు, బాలికలు, పురుషులు, బాలురు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు అన్ని దేశాల మతాలు, జాతులకు, అన్ని వయస్సులకు చెందిన ప్రజలు మేము ఈ తరం సమానం ’’ అనే నినాదంతో ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. సామాజిక, ఆర్థిక న్యాయంతో హింసకు తావులేని లైంగిక, పునరుత్పత్తి హక్కులను స్త్రీలు అనుభవించే విధంగా కృషి చేయాలని తద్వారా ఏర్పడే లింగ సమత్వ ప్రపంచ నిర్మాణంలో కృషి చేయాలని కోరింది. లింగ సమత్వ సాధన దిశలో 2020 సంవత్సరానికి మరో మూడు ప్రాధాన్యతలను కల్గి ఉంది. స్త్రీల భద్రత కోసం 2000 సంవత్సరంలో భద్రతా సమితి చేసిన తీర్మానం 1325కి 20ఏండ్లు, 2010లో స్ధాపించిన ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం దశమ వార్షికోత్సవం 2015లో ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2030 లింగ సమత్వ తీర్మానానికి 5 సంవత్సరాలు నిండాయి. లింగ వివక్షను అంతం చేయడం కోసం, స్త్రీలు, బాలికలు తమ హక్కులను తెలుసుకుని, అనుభవించడం కోసం ఇంకా ఎన్ని తరాలు మారాలి అనే ఆవేదనతో ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ అనే ఉద్వేగంతో మహిళ సంఘాలు, హక్కుల కార్యకర్తలు…వంటి హ్యష్‌ ‌ట్యాగ్‌లతో ఇప్పటికే ప్రచార, అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు.

భద్రత, మనుగడ వంటి అంశాలకు పరిమితమైన ఉద్యమాలు ఈ పరిధిని దాటి అన్ని రంగాలలో పురుషులతోపాటు సమానంగా శ్రీఘ్రగతిన అభివృద్ధి, వికాసం దిశల వైపు ప్రయాణం చేయడం కోసం కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. విప్లవాలు లేకపోతే మహిళలకు విముక్తి లేదు, అలాగే మహిళలు లేనిదే విప్లవాలు లేవు. ఈ సార్వత్రిక సూత్రం వెలుగులో, బీజింగ్‌ ‌డిక్లరేషన్‌ ‌స్ఫూర్తితో చారిత్రక, సామాజిక మార్పు ఉద్యమాలను నిర్వహిస్తున్నారు. 2003లో లైబీరియా మహిళలు తమ దేశంలో 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం నివారించడానికి సెక్స్‌స్ట్రైక్‌ను నిర్వహించి మగవారిలో పరివర్తన తెప్పించారు. ఫలితంగా ప్రాణనష్టం, ఆస్తుల విధ్వంసంతో కల్లోలమైన లైబీరియాలో అంతర్యుద్ధం ముగిసి శాంతిస్థాపన జరిగింది. ఎల్లెన్‌ ‌జాన్సన్‌ ‌సర్‌లీఫ్‌ అనే మహిళ దేశాధినేతగా ఎన్నికయ్యారు. వేతన వ్యత్యాసాలు తొలగించాలని ఐస్‌లాండ్‌ ‌మహిళలు ఆర్థిక, ఉత్పాదక, గృహ సంబంధ పనులలో పాల్గొనకుండా సమ్మెను నిర్వహించారు. 2006 మైస్పేస్‌ ‌సామాజిక మాద్యమం వేదికగా తారానా బర్క్ అనే నీగ్రో యువతి ప్రారంభించిన ‘‘ మీ టూ ’’ ఉద్యమం ఉవ్వెత్తున దావానాలంలా పాకి ప్రపంచాన్ని కుదుపేసింది. లైంగిక దాడులు, వేధింపుల బాధిత మహిళలు ఈ ఉద్యమ ప్రభావంతో బహిరంగంగా తమపై అణచివేతకు, అఘాయిత్యాలకు పాల్పడిన వారి గురించి చెప్పడం ప్రారంభించారు. ప్రముఖ హలీవుడ్‌ ‌నటి అలిస్స మిలినో, హలీవుడ్‌ ‌సినిమా నిర్మాత హర్వే వైన్‌స్టీన్‌ ‌తనను అనేకమార్లు లైంగికంగా వేధించిన సంగతి వెల్లడి చేయడంలో మీటూ ఉద్యమం తారస్థాయికి చేరింది.

ఈ ఉద్యమానికి మద్దతుగా బాధిత మహిళల న్యాయ సహాయం కోసం హలీవుడ్‌ ‌నటీమణులు ‘‘టైమ్స్ అప్‌’’ ‌నినాదంతో 22 మిలియన్‌ ‌డాలర్లను నిధిగా సేకరించారు. ఈ ఉద్యమ ప్రభావంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మందిపై కేసులు నమోదు కావడం, శిక్షలు పడడం, కీలక అధికార స్థానాలలో ఉన్నవారు రాజీనామాలు చేయడం ప్రపంచ దేశాలలో సంభవించాయి. భారత్‌లో 20 మందికి పైగా మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించిన ఏషియన్‌ ఏజ్‌ ‌పత్రిక మాజీ సంపాదకుడు, బిజెపికి చెందిన కేంద్రమంత్రి యం.జె.అక్బర్‌ ‌రాజీనామా చేసాడు. మనిషి జన్మ రుతుస్రావంతో ముడిపడి ఉన్నదనీ, పున:సృష్టికి దోహదం చేసే ఒక గౌరవనీయమైన, ఆరోగ్య కరమైన, సహజ, శారీరక పరిణామమని నెలసరి పేరుతో స్త్రీలకు ఆరాధన స్థలాలు దర్శించడంపై ఆంక్షలు తగవని భారతదేశంలో నిఖిత ఆజాద్‌ ‌భూమాత బిగ్రేడ్‌, ‌తృప్తిదేశీయ ‘హాపీ టూ బ్లీడ్‌’ ‌వంటి ఆరోగ్య సంరక్షణ ఉద్యమాలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఉద్యమాలు పాత విలువలకు పాతర వేస్తూ ముందు పరిస్థితి కంటే మెరుగైన పరిస్థితులు ఏర్పడటానికి దోహదం చేస్తున్నాయి. అగ్రభాగాన నడుస్తున్న మహిళలను నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టిన వీరులుగా చరిత్రలో పరిగణించబడుతున్నారు.

1995 బీజింగ్‌ ‌డిక్లరేషన్‌ ‌తర్వాత దాదాపు అన్ని ఐరాస సభ్య దేశాలలో సంఘటిత రంగంలో పని చేస్తున్న మహిళలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవును పొందారు. చట్ట•ద్ధంగా గర్భస్రావ హక్కును పొందారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నతవిద్యాసంస్థలలో స్త్రీల నమోదు గణనీయంగా పెరిగింది. పురుషుల క్రియాశీల భాగస్వామ్యం లేనిదే లింగ సమానత్వం సాధించలేము. ఈ వెలుగులో ‘ఆమె కోసం అతను’ పాల్గొనే సానుకూల ధోరణులు పెరిగాయి. రక్షణ, శాస్త్ర, సాంకేతిక, ప్రభుత్వపాలనలోని కొన్ని విభాగాలలో స్త్రీల భాగస్వామ్యం ఉన్న ఆంక్షలు అనేక దేశాలలో ఎత్తివేయబడ్డాయి. సమాజంలోని అన్ని రంగాలలో పురుషులతోపాటు స్త్రీలు సమానంగా పనిచేయడం ప్రాథమిక మానవ హక్కు. సమకాలీన ప్రపంచంలో రాజకీయ రంగం నుండి క్రీడారంగం వరకు పరిశీలిస్తే స్త్రీలకు, ఇంకా సరైన ప్రాతినిధ్యం లేదు. జెండర్‌ ‌గ్యాప్‌లో అంతరాలు కొనసాగుతున్నాయి. అయితే మహిళా సాధికారత సాధన దిశలో వేస్తున్న ప్రతి అడుగు ఒక గొప్ప విజయంగా భావించే స్థితి నెలకొంది. 1995లో ప్రపంచదేశాలలో రాజకీయ రంగంలో మహిళా పార్లమెంటేరియన్‌లు 11.7% ఉన్నారు. 2020లో వీరి శాతం 24.9%కి చేరింది. అలాగే నలుగురు దేశాధ్యక్షులుగా,13 మంది ప్రధానమం త్రులుగా పని చేస్తున్న దశకు మారింది. అయితే సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి, భవిష్యత్‌ ‌నిర్మాణ ఫలాలు స్త్రీలకు సమంగా అందించే విధాన నిర్ణయాల రూపకల్పనలో స్త్రీల వాటా39% తగ్గింది. గృహ సంబంధ వేతనం లేని పనులలో ఎక్కువగా గడపడం, ఉన్నత విద్యా అవకాశాలు, సాంస్క •తిక పరమైన ఆంక్షలు, మహిళా శ్రామిక శక్తి సూచీలో మందగమనం ఉంది. ఫార్చూన్‌ ‌జాబితాలోని 500ల అగ్రశ్రేణి కంపెనీలలో 1995లో 0.2% ఉన్న మహిళ సీఈఓలు 2019లో 7%కు చేరుకున్నారు.

మానవ జాతి చరిత్రను మలుపు తిప్పిన శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు ఇస్తున్న అత్యున్నత పురస్కారం నోబెల్‌ను స్వీకరించిన 900 మందిలో 53 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. సైన్స్, ఇం‌జనీరింగ్‌, ‌టెక్నాలజీ, మాథమేటిక్స్ (‌స్టెమ్‌) అధ్యయనాలలో, పరిశోధనలలో స్త్రీల భాగస్వామ్యం శీఘ్రగతిన పెరగాల్సి ఉంది. ప్రసార మాధ్యమాలలో వార్తల్లోని వ్యక్తులుగా స్త్రీల వాటా 24% మాత్రమే ఉంది. పనిచేస్తున్న రిపోర్టర్‌లలో 37% వాటాను కల్గి ఉన్నారు. క్రీడా పారితోషికాలలో భారీ తేడా ఉన్నా క్రీడల్లో స్త్రీల భాగస్వామ్యం చాలా మెరుగుపడింది. 1900 తొలి ఒలింపిక్స్‌లో 2.2% ఉన్న మహిళా క్రీడాకారులు 1996 ఒలింపిక్స్‌లో 38% టోక్యోలో నిర్వహించబోయే 2020 ఒలింపిక్స్‌లో 48.8% పాల్గొనబోతున్నారు.

Shoba prajatantra neews articlesప్రపంచవ్యాప్తంగా స్త్రీలు బురద పాదాలు, మట్టి చేతులతో ఆహారోత్పత్తి పనుల్లో సగభాగం నిర్వహిసున్నా భూమిపై హక్కులు మాత్రం పొందడం లేదు. ఇస్లామిక్‌ ‌దేశాలలో ఆర్థిక, ఉత్పాదక కార్యక్రమాలలో స్త్రీల పాత్ర తక్కువగా ఉంది. సమాన పనికి పురుషులతో పోల్చినప్పుడు 30% తక్కువ వేతనాలు పొందుతున్నారు. లింగ నిష్పత్తి ప్రమాదకరంగా మారి సామాజిక సంబంధాలలో అపసవ్య ధోరణులకు దారి తీస్తున్నది. లింగ సమానత్వంలో భారత పరిస్థితి చిత్రపటం నిరాశజనకంగా ఉంది. మన దేశం ముందెన్నడూ లేని తీవ్రమైన ఆర్థిక, రాజకీయ, సాంస్క •తిక కృషితో మధ్య యుగాల నిర్బంధ•ం, నిషేధాలు, మూఢత్వాల నుండి స్త్రీల విముక్తి కోసం రాజ్యాంగ రక్షణలు, చట్టాలు రూపొందించబడ్డాయి. స్వాతంత్య్రం తర్వాత పరిస్థితులు కాస్తా మెరుగుపడినా గత ఆరు సంవత్సరాల నుండి ‘‘ఇంటి పని కోసమే ఇల్లాలు’’ అనే భావజాలం పాలకుల విధానాలతో లింగ సమానత్వ సూచికలలో అథమ స్థానాలకు చేరింది.

శ్రామికశక్తిలో స్త్రీల వాటా 21%తో తక్కువగా ఉన్న దేశాలలో ప్రథమస్థానం పొందింది. మనుగడ, రక్షణలో తక్కువగా ఉన్న దేశాలలో నాలుగవ స్థానం పొందింది. లింగ సమానత్వ సాధన ఉద్యమం నిరంతరంగా కొనసాగే సుదీర్ఘ ప్రక్రియ అని హక్కుల ఉద్యమ చరిత్ర తెలియచేస్తున్నది. మహిళ విముక్తి ఉద్యమాన్ని సామాజిక వ్యవస్థ మార్పు కొరకు సాగే ఉద్యమంతో మేళవించాలి. ఈ దిశగా ఈ తరం తమ నిత్యజీవితంలో గృహ సంబంధ పనులలో చేయూతనివ్వడం, వేధింపులు, అసభ్యతకు తావివ్వకుండా ప్రజాస్వామికంగా ప్రవర్తించడం, లింగబేధం లేకుండా మానవులుగా, ప్రజలుగాసంభోదించడం, వసతులతో కూడిన పని సంస్క •తిని ప్రోత్సహించడం, ప్రజ్ఞా పాటవాలను, నాయకత్వ లక్షణాలను, శారీరక, మానసిక ఆరోగ్యమే నిజమైన అందమనే ధోరణులను పెంచడం, స్త్రీవాద సాహిత్యం, ప్రచార మాద్యమాలను ఆదరించడం, వృత్తి, భాగస్వామి ఎంపికలో స్వేచ్ఛనివ్వడం వంటి ఆభరణాలు లింగ సమానత్వ సాధన లక్ష్యాన్ని వేగవంతం చేస్తాయి. అప్పుడే ఆమె కోసం అతనుతో ఉమ్మడి పోరాటాలను నిర్వహించి పాలకుల ద్వారా లింగ వివక్ష లేని సకల రంగాలలో అభివృద్ధి ఫలాలు అందరికి సమానంగా అందే సమతా ప్రపంచం ఆవిష్క •తమవుతుంది. దీనికోసం పౌర సమాజం పట్టుదలతో, ఓర్పుతో, శక్తి వంచన లేకుండా కృషి చేస్తే నూతన విశ్వమహిళ తప్పక ఆవిర్భవిస్తుంది.

 

Leave a Reply