Take a fresh look at your lifestyle.

మార్మోగిన శివనామ స్మరణ

Memorial of the Shivanama of Mormogina

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో ‘‘హర’’నామస్మరణతో మారుమోగాయి .ఉదయం తెల్లవారుజామునే భక్తులు చన్నీటి స్నా నమాచరించి భక్తి శ్రద్దలతో అభిషేకాలు నిర్వహించారు. పురాతన దేవాలయాలను దర్శించి రుద్రా అభిషేకాలు జరిపారు . పాతబజార్‌ ‌లోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు మారేడు దళాలతో బిల్వార్చనచేశారు .  . మార్కండేయస్వామి దేవాలయంలో ఉదయం మహాన్యాస పూజ చేసి అనంతరం అన్నప్రసాద పూజ నిర్వహించారు రాత్రి స్వామి వారికీ కళ్యాణం  నిర్వహిస్తున్నామన్నారు.

అదేవిధంగా మహబూబాబాబాద్‌ ‌మండలంలోని కంబాలపల్లి గ్రామంలో పురాతన రాజేశ్వరుని దేవాలయంలో స్వామి వారి  కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు . స్థానిక సర్పంచ్‌ ‌గ్రామా యువకులు దేవాలయం అలంకరించి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు . మధ్యాహ్నం 2.గంటలకు కళ్యా ణం నిర్వహించిభక్తులకు ప్రసాదం వితరణ చేశారు . ఈ కార్యక్రమాలో సర్పంచ్‌ ‌సంద వీరన్న , భక్తులు కంబా లపల్లి గ్రామా అభివ్రద్ధి కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply