Take a fresh look at your lifestyle.

బిజెపి కార్యాలయానికి భూమి పూజ

వనపర్తి,ఆగస్టు,10(ప్రజాతంత్ర విలేకరి) : వనపర్తి బిజెపి కార్యాలయానికి సోమవారం నాడు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతు తెలంగాణలో ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌, ‌భూపాలపల్లి, మహబూబాబాదు, వరంగల్‌, ‌రూరల్‌ ‌రాజన్న, సిరిసిల్ల ఆదిలాబాద్‌, ‌కొమురం భీం, ఆసిఫాబాద్‌ ‌వనపర్తి, నారాయణపేట, వికారాబాద్‌, ‌జిలాలలో నూతన బిజెపి కార్యాలయం భూమి పూజ జరుగుతుందని అన్ని కార్యాలయాలకు డిజిటల్‌ ‌మాధ్యమం వేదికగా బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్‌‌ప్రకాష్‌ ‌నడ్డా  శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌గతంలో గుర్తింపు పొందిన పార్టీలకు ఆయా జిల్లా కేంద్రాల్లో ఒక ఎకరం భూమి పార్టీ కార్యాలయం కొరకు ఇస్తామని ప్రకటించారు కాని నేడు అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి మాత్రమే భూములు కేటాయించి మిగతా రాజకీయ పార్టీలకు ఇవ్వకపోవడం శోచనీయమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకపోయిన బిజెపి కేంద్ర పార్టీ తెలంగాణలోని 32 కార్యాలయాల కొరకు పార్టీ నిధులు కేటాయించిందని కేవలం ఒక సంవత్సరంలోనే అందమైన సువిశాలమైన భవనం పూర్తి చేసుకుందాం అని అన్నారు.అందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.కార్యక్రమంలో ఓబిసి మోర్చా రాష్ట్ర నాయకులు మున్నూరు రవీందర్‌, ‌మాజీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బి.కృష్ణ, బిజెపి సీనియర్‌ ‌నాయకులు జిఞకల కృష్ణయ్య, భూజల వెంకటేశ్వర్‌ ‌రెడ్డి,మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. నారాయణ, మాజీ ఉపాధ్యక్షులు రామన్నగారి వెంకటేశ్వర్‌రెడ్డి, బి. శ్రీసైలం, ఏ. సీతారాములు, మాధవ రెడ్డి, బంజారు కుమారస్వామి, అక్కలరామన్‌గౌడ్‌, ‌కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply