కెటిఆర్‌ను కలిసిన జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్

హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్, హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎన్నికైన ఆకుల రజిత వెంకన్న తో పాటు కౌన్సిలర్లు గురువారం తెలంగాణ భవన్లో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును మర్యాద పూర్వకంగా కలిశారు. మున్సిపల్ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించేందుకు కృషి చేసిన మంత్రి కెటిఆర్‌ను ఎమ్మెల్యే సతీష్ కుమార్‌తో పాటు మున్సిపల్ చైర్మన్ రజిత వెంకట్‌లను ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కెటిఆర్ కూడా ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు, కొత్త మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన ఆకుల రజిత వెంకట్ లతో పాటు కౌన్సిలర్లకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
హుస్నాబాద్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా పని చేయాలని మంత్రి వారికి సూచించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధిపై దృష్టి పెట్టిందని ప్రభుత్వం నుండి వచ్చే నిధులు సద్వినియోగం చేసుకొని నాణ్యమైన పనులు చేయాలని కోరారు. ప్రజలకు పారదర్శకమైన పాలన, మెరుగైన పాలన, వసతులు, పారిశుద్ధ్యం అందించాలన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విశ్వసించి ఓట్లు వేసిన ప్రజలకు నిరంతరం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సిఎం కెసిఆర్ మున్సిపాలిటీ అభివృద్ధిపై ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నారని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ పాలన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు విశ్వసిస్తున్నారన్న విషయం మున్సిపల్ ఎన్నికలు నిరూపించాయన్నారు. ప్రజల ఆశలను వమ్ము చేయకుండా నిరంతరం మున్సిపల్ పాలకవర్గం ప్రజాసేవలో నిమగ్నమై మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు.
Tags: Satish Kumar, Hosnabad Municipal Chairperson, Hosnabad MLAs, akula ranjitha venkanna