Take a fresh look at your lifestyle.

భవిష్యత్‌లో… ప్రతీ పల్లెకు పల్లె దవాఖాన

  • ప్రజలకు వైద్య సేవ చేయడం అదృష్టంగా భావించాలి
  • చిన్నకోడూరులో ఆశా కార్యకర్తలకు 4జీ మొబైల్‌ ‌సిమ్‌ ‌కార్డుల పంపిణీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు
  • దవాఖానలలో అన్నీ సమకూర్చాం.. అలసత్వం వహించొద్దనీ సుతిమెత్తగా హెచ్చరిక
  • ఓపికతో పని చేయండి..ప్రభుత్వానికి మంచి పేరు తెండి
  • వైద్యులు, సిబ్బందికి మంత్రి హరీష్‌రావు సూచన

సిద్ధిపేట, నవంబర్‌ 20 (‌ప్రజాతంత్ర బ్యూరో): భవిష్యత్‌లో రాష్ట్రంలో ప్రతీ పల్లెకు పల్లె దవాఖానలు తేనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. ప్రజలను ఆరోగ్యంగా కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రజలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఓపికతో పని చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి మంత్రి హరీష్‌రావు సూచించడంతో పాటు నిరుపేద ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలన్నారు. శనివారం సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు పిహెచ్‌సిలో 49మంది ఆశా వర్కర్లకు జియో 4జీ మొబైల్‌ ‌సిమ్‌ ‌కార్డుల పంపిణీకి మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..ప్రజలకు ప్రభుత్వ వైద్యం చేరువలో తేవాలనే లక్ష్యంగా సిఎం కేసీఆర్‌ ‌విజన్‌కు అనుగుణంగా భవిష్యత్‌లో ప్రతీ పల్లెకు పల్లె దవాఖానలు తెస్తామని, ప్రతీ పల్లె ప్రాథమిక ఉప కేంద్రంలో స్టాఫ్‌ ‌నర్సు, ఏఏన్‌ఎం‌లు, వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రభుత్వ దవాఖానలలో కావాల్సిన అన్నీ వసతులు ఉన్నాయని, ప్రజలకు మంచి వైద్య సేవలు చేద్దామని వైద్య అధికారులు, సిబ్బందిని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రజల వైద్యం కోసం అన్నీ సమకూర్చి అందుబాటులో పెట్టారని, ఏవైనా ఇబ్బందులు ఉంటే.. చెప్పాలని.. ఎక్కడ అలసత్వం, నిర్లక్ష్యం ఉండొద్దని వైద్య అధికారులు, సిబ్బందిని సుతిమెత్తగా హెచ్చరించారు.

24/7 నిరంతరం వైద్య సేవలు అందించాలని, ప్రతీ వైద్యాధికారి, సిబ్బంది ఆరోగ్య కేంద్రాలలో సమయపాలన తప్పనిసరి పాటించాలని ఆదేశించారు. అవసరమైన మందుల కోసం సెంట్రల్‌ ‌డ్రగ్స్ ‌స్టోర్‌ ‌కూడా జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోనే ఉందనీ, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రి పట్ల విశ్వాసం పెరిగేలా ఓపికతో పని చేయాలని సూచించారు. ప్రతీ పీహెచ్‌సీలో పాము, కుక్క, తేలు కాటుకై వచ్చే రోగులకు అర్థరాత్రి వచ్చినా కావాల్సిన మందులు ఇచ్చి వారిని కాపాడుకోవాలని, ప్రజలను ఆరోగ్యంగా కాపాడుకోవడమే ప్రభుత్వ బాధ్యతగా ఆరోగ్య మంత్రి హరీష్‌ ‌చెప్పుకొచ్చారు. చిన్నకోడూర్‌లో ఆశా కార్యకర్తలకు జియో 4జీ మొబైల్‌ ‌సిమ్‌ ‌కార్డులు పంపిణీలో భాగంగా చిన్నకోడూర్‌ ‌ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యాధికారి మనోహర్‌ ‌తో కలిసి ఏ వైద్యాధికారి ఏమీ విధులు నిర్వర్తిస్తున్నారనే కోణంలో మానిటరింగ్‌ ‌చేయడం మొదలు పెట్టారు. మీరు చేసే విధుల గురించి సవివరంగా వివరించాలని ఒక్కొక్కరినీ ఆరా తీశారు. జిల్లా మెటర్నల్‌ ‌హెల్త్ ‌ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ ‌రజినితో చర్చిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణీల విషయమై 12 వారాలలో రిజిస్ట్రేషన్లు చేయిస్తామని, విడతల వారీగా చెకప్‌ ‌చేస్తామని రజిని వివరించగా.. ఎప్పుడెప్పుడు చేస్తారో.. క్షుణ్ణంగా చెప్పాలని, 66 శాతం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని, మిగతా 34 శాతం ప్రయివేటు దవాఖానకు వెళ్తున్నారని.. ఆ 34 శాతం కూడా వెళ్లకుండా మీరు చేపట్టిన, చేపడుతున్న చర్యలపై, ప్రతీ నెలా ఆశాలతో సమావేశాలు జరిపి, మీరేం చేస్తున్నారని.. ఇవాళ జిల్లా గర్భిణీల సంఖ్య ఎంత అని మంత్రి ఆరా తీశారు.

పుట్టిన గంటలోపే తల్లిపాలిచ్చే ప్రాధాన్యతపై చెప్పాలి…
పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు ఇవ్వాలి కదా. దాని ప్రాధాన్యత చెప్పాలి కదా అంటూ.. జిల్లాలో సెక్షన్లు 70 శాతం మనకు అవమానం కదా అంటూ.. పీవో రజినిని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. నార్మల్‌ ‌డెలివరీలు జరిగేలా చూడాలని, పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇచ్చే ప్రాధాన్యత పై చెప్పడం మీ విధి అంటూ తల్లి, బిడ్డ ఆరోగ్యాలు కాపాడేలా చూడాలని ఇక నుంచి డైలీ మానిటరింగ్‌, ‌వీక్లీ వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహిస్తానని.. మీ విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. జిల్లాలో 1 లక్షా 98 వేల మంది బీపీ, షుగర్‌, ‌క్యాన్సర్వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారికి •లాంటి మందులు ఇస్తున్నారని మంత్రి ఆరా తీశారు. ఇచ్చిన మందులు వ్యాధిగ్రస్తులు వాడుతున్నారా? లేదా? అంటూ.. బీపీ, షుగర్‌ ‌వ్యాధి రాకుండా ప్రజలలో ఏ రకంగా చైతన్యం తెస్తున్నారో.. తెలపాలని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని పలు పీహెచ్‌సీల వారీగా ఆరా తీసి స్క్రీనింగ్‌ ‌కరెక్ట్ ‌చేయలేదని.. ఇంత వత్యాసం ఉండొద్దని సుతిమెత్తగా మందలించారు. పీహెచ్‌సీ పరిధిలో వైద్య చికిత్స చేయలేని పెద్ద రోగమొస్తే పెద్ద ఆసుపత్రికి రెఫర్‌ ‌చేసే విధానమే టెలీమెడిసిన్‌.. ఈ ‌విధానం ఎంత వరకు అమలు చేస్తున్నారో.. ఆరా తీశారు. ఒకరి ద్వారా మరొకరికి సంక్రమించే వ్యాధి టీబీ అని మీరు చేస్తున్న విధులు, నిర్వహణపై మంత్రి ఆరా తీసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 1648 మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారనీ ప్రతినెలా టీబీ వ్యాధిగ్రస్తుడికి 500 రూపాయలు ఇస్తున్నాం. జిల్లాలో టీబీ రికవరీ రేట్‌ 98 ‌శాతం ఉందని సంబంధిత వైద్యుడు వివరించాడు. జిల్లాలోని 5 మంది ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు వివిధ సందర్భాలలో ఒకేసారి అందరూ పీహెచ్‌సీలో సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని, మంచి రిజల్టస్ ‌వస్తాయని ఆదేశించారు. పోస్ట్ ‌కోవిడ్‌ ‌కేసులలో టీబీ కేసులు పెరుగుతున్నాయని పీఓ వెంకటేష్‌ ‌తెలుపగా ప్రతీ నెలా జాబ్‌ ‌చార్ట్ ‌రిపోర్టు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

వంద శాతం కొరోనా వ్యాక్సినేషన్‌ ‌పూర్తి చేయండి…
జిల్లాలో వంద శాతం కొరోనా వ్యాక్సినేషన్‌ ‌పూర్తి అయ్యేలా పీవోలతో స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌జరపాలని జిల్లా వైద్యాధికారి మనోహర్‌ ‌ను మంత్రి ఆదేశించారు. జిల్లాలో కొరోనా వ్యాక్సిన్‌ 7 ‌లక్షల ప్రజలకు 6 లక్షల మంది మొదటి డోస్‌ ‌వేసుకున్నట్లు, వీటిలో జిల్లాలోని 9 పీహెచ్‌సీ కేంద్రాలు వంద శాతం పూర్తి చేశాయని మంత్రి దృష్టికి పీఓ తీసుకువచ్చారు. సెకండ్‌ ‌డోస్‌ ‌కూడా త్వరితగతిన పూర్తి చేయించి మండలాలు, గ్రామాల వారీగా కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌పూర్తయ్యిందని డిక్లరేషన్‌ ఇచ్చేలా ప్రణాళికతో ముందుకు పోవాలని వైద్యాధికారులను మంత్రి సూచించారు. అనంతరం చిన్నకోడూర్‌ ‌ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందిలో విధుల పట్ల వారికి ఉన్న నిబద్ధతను గమనిస్తూ.. ఒక్కొక్కరినీ ఆరా తీసి మన బాధ్యత మనం చేయకపోతే ఎట్లానని, తప్పనిసరిగా సమయ పాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎఫ్‌డిసి మాజీ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, చిన్నకోడూరు ఎంపిపి కూర మాణిక్యరెడ్డి, సర్పంచి కాముని ఉమేష్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు బొడిగె సదానందంగౌడ్‌, ‌మేడికాయల వెంకటేశం, ములకల కనకరాజు, తాళ్లపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు డిఎంహెచ్‌వో మనోహర్‌, ‌సంబంధిత వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply