Take a fresh look at your lifestyle.

మన రాష్ట్రం నుంచే .. తొలి టీకా

  • కొరోనా వ్యాక్సిన్‌ ‌పరిశోధనల్లో ముందున్న హైదరాబాద్‌ ‌జీనోమ్‌
  • ‌భారత్‌ ‌బయోటెక్‌ ‌సంస్థలో సక్షించిన మంత్రి కెటిఆర్‌
  • ‌దేశానికి ఇన్నోవేషన్‌ ‌కేంద్రంగా హైదరాబాద్‌ : ‌భారత్‌ ‌బయోటెక్‌ ఎం‌డీ డా. కృష్ణ ఎల్లా
  • వ్యాక్సిన్‌తో పాటు ఔషధాలు కూడా అవసరం : డబ్ల్యుహెచ్‌ఓ ‌చీఫ్‌ ‌సైంటిస్ట్ ‌డా.సౌమ్య
తెలంగాణ నుంచే కొరోనా వైరస్‌కు తొలి టీకా వస్తుందని మంత్రి కేటీఆర్‌ ‌విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న భారత్‌బయోటెక్‌ ‌సంస్థ నుంచే ఆ టీకా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.  హైదరాబాద్‌లోని జీనోమ్‌ ‌వ్యాలీలో ఉన్న భారత్‌ ‌బయోటెక్‌ ‌వ్యాక్సిన్‌ ‌ప్రొడక్షన్‌ ‌సెంటర్‌ను రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ‌మంగళవారం సందర్శించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు డాక్టర్‌ ఎల్లా,  శ్రీమతి సుచిత్రా ఎల్లా కూడా పాల్గొన్నారు. భారత్‌ ‌బయోటెక్‌ ‌సంస్థ ఉద్యోగులతో మంత్రి మాట్లాడారు.  సీఎండీ డాక్టర్‌ ‌కృష్ణా ఎల్లా, తెలంగాణ లైఫ్‌ ‌సైన్సెస్‌ అం‌డ్‌ ‌ఫార్మా డైరక్టర్‌ ‌శక్తి నాగప్పన్‌తో కలిసి మంత్రి చర్చను నిర్వహించారు. వైరస్‌ ‌వ్యాక్సిన్‌ ‌తయారీలో భారత్‌బయోటెక్‌ ‌ముందంజంలో ఉండడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కొరోనాకు టీకా తొలుత హైదరాబాద్‌ ‌నుంచి, అందులో భారత్‌ ‌బయోటెక్‌ ‌నుంచి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టీకాల అభివృద్ధి, తయారీలో భారత్‌ ‌భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచదేశాలు పదేపదే చెబుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ అవసరాల దృష్ట్యా హైదరాబాద్‌ ‌ప్రాముఖ్యత కూడా పెరిగినట్లు మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌ ‌నుంచి మూడవ వంతు వ్యాక్సిన్‌ ‌ప్రపంచ దేశాలకు అందించడం గర్వంగా ఉందన్నారు.  అందరి నిరంతర కృషి వల్లే ఇది సాధ్యమవుతోందని మంత్రి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ ‌సైంటిస్ట్ ‌సౌమ్య స్వామినాథన్‌ ‌కూడా మంత్రి కేటీఆర్‌ ‌నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు.
దేశానికి ఇన్నోవేషన్‌ ‌కేంద్రంగా హైదరాబాద్‌ : ‌భారత్‌ ‌బయోటెక్‌ ఎం‌డీ..
డా. కృష్ణ ఎల్లాప్రపంచంలోని ఏ వ్యాక్సిన్‌ ‌కంపెనీ కంటే కూడా హైదరాబాద్‌ ‌కంపెనీలు తక్కువ కాదని భారత్‌ ‌బయోటెక్‌ ఎం‌డీ డా. కృష్ణ ఎల్లా అన్నారు. దేశానికి ఇన్నోవేషన్‌ ‌కేంద్రం హైదరాబాదేనని అన్నారు. జీనోమ్‌ ‌వ్యాలీలో కరోనా వ్యాక్సిన్‌పై మంత్రి కెటిఆర్‌తో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 70 శాతం హైదరాబాద్‌లోని 3 కంపెనీల నుంచే ఉత్పత్తి అవుతున్నాయని  కృష్ణా ఎల్లా తెలిపారు. కరోనా కొత్త వైరస్‌ ‌కావడం వల్ల ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తున్నందన్నారు. కొవిడ్‌-19‌కు వ్యాక్సిన్‌ ‌తయారీలో ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా కూడా సహకారం అందిస్తున్నాయని తెలిపారు.  కంపెనీల మధ్య మార్కెట్లో పోటీ ఉండోచ్చు కానీ.. అందరి పోరాటం కరోనాను ఎదుర్కోవడానికేనని డాక్టర్‌ ‌కృష్ణ వెల్లడించారు. ప్రపంచం మొత్తానికి ఒకటే క్వాలిటీ గల వ్యాక్సిన్‌ను ఇస్తామని చెప్పారు. వాటర్‌ ‌బాటిల్‌ ‌కంటే తక్కువ ధరకే కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ అం‌దిస్తామని కృష్ణ ఎల్లా స్ఫష్టం చేశారు.
వ్యాక్సిన్‌తో పాటు ఔషధాలు కూడా అవసరం : డబ్ల్యుహెచ్‌ఓ ‌చీఫ్‌ ‌సైంటిస్ట్ ‌డా.సౌమ్య
image.png

ఇంకెన్నాళ్లు ఇలా వైరస్‌తో కలిసి జీవించాల్సి ఉంటుందని మంత్రి కేటీఆర్‌ ‌వేసిన ప్రశ్నకు డాక్టర్‌ ‌సౌమ్య స్వామినాథన్‌ ‌సమాధానం ఇచ్చారు.  దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌పై చర్చ భిన్న స్థాయిల్లో జరగాల్సిన అవసరం ఉందని సౌమ్య తెలిపారు.  నోవెల్‌ ‌కరోనా వైరస్‌ ‌భూగోళాన్ని చుట్టేసిందని, అన్ని దేశాల్లోనూ వైరస్‌ ‌కేసులు నమోదు అయ్యాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ ‌సైంటిస్ట్ ‌తెలిపారు. వైరస్‌ ఇమ్యూనిటీ గురించి ఇంకా తెలుసుకునే దశలోనే ఉన్నామన్నారు.  ఎవరికి వైరస్‌ ఎక్కువగా సంక్రమిస్తుంది, ఎవరికి సంక్రమించడం లేదో ముందు తెలుసుకోవాలన్నారు. పిల్లల్లో ఎందుకు వైరస్‌ ‌కేసులు తక్కువగా ఉన్నాయో గమనించాలన్నారు.  వైరస్‌ ‌సోకిన వ్యక్తిని ఐసోలేట్‌ ‌చేయాలని,  కాంటాక్ట్ ‌ట్రేసింగ్‌ ‌చేయాలని, క్వారెంటైన్‌ ‌కావాలన్నారు. అధిక సాంద్రత జనాభా ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంటుందని సౌమ్య తెలిపారు.  గ్రామాల్లో వైరస్‌ ‌కేసుల గుర్తింపు బాగానే ఉన్నదని, జిల్లాలను వేరు చేసి కేసులను గుర్తిస్తున్న తీరు సరళంగా ఉందన్నారు. కానీ పట్టణాలు, నగరాల్లో మాత్రం సరిగా లేదన్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు. భారత్‌లో ప్రస్తుతం కొరోనా వైరస్‌ ‌టెస్టింగ్‌ ‌పక్రియ తక్కువ స్థాయిలో జరుగుతున్నట్లు సౌమ్య తెలిపారు. కనీసం 8 నుంచి 10 అంశాల్లో ప్రభుత్వాలు పూర్తి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను కూడా ప్రభుత్వాలు తెలియ జేయాలన్నారు.  మాస్క్‌లను ధరించే అంశంలోనూ ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు.  ప్రతి ఒకరు మాస్క్‌ను పెట్టుకుంటే, అప్పుడు వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టే ఛాన్సు ఉందని డాక్టర్‌ ‌సౌమ్య స్వామినాథన్‌ ‌తెలిపారు.  సోషల్‌ ‌డిస్టాన్సింగ్‌ ‌కూడా కీలకం అన్నారు. ఆర్థికవ్యవస్థను పునర్‌ ‌ప్రారంభించే దశలో జనం ఫ్యాక్టరీల వద్ద గుమ్మికూడే ప్రమాదం ఉంటుందని, అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 27 వ్యాక్సిన్లకు క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌జరుగుతున్నట్లు డాక్టర్‌ ‌సౌమ్య స్వామినాథన్‌ ‌తెలిపారు. అయితే ట్రయల్స్ ‌జరుగుతున్న టీకాల సామర్థ్యం, భద్రత మరికొన్ని నెలల్లో తెలిసిపోతుందన్నారు. టీకాల విషయంలో సేప్టీ చాలా ముఖ్యం అన్నారు.

 ప్రజల విశ్వాసాన్ని గెలవడంలో అది కీలక పాత్ర పోషిస్తుందన్నారు.  భారీ సంఖ్యలో వాక్సినేషన్‌ ‌జరిగినప్పుడు,  సేప్టీబార్‌ను చాలా ఉన్నత స్థాయిలో చూడాల్సి వస్తుందన్నారు. వ్యాక్సిన్‌ను ప్రజలు ఆదరించాలన్నా.. దానికి భద్రత చాలా ముఖ్యమన్నారు.  వ్యాక్సిన్‌ ‌ట్రయల్స్‌లో సైడ్‌ఎఫెక్టస్ ‌గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.  నిఘా ఉంటేనే వ్యాక్సిన్‌ ‌సక్సెస్‌ ‌రేటు ఎక్కువగా ఉంటుందన్నారు. వ్యాక్సిన్‌ ‌వచ్చినా.. ఓ రెండేళ్ల పాటు ఆ టీకా సేప్టీ ప్రొఫైల్‌ ‌గమనించాల్సి ఉంటుందన్నారు. వ్యాక్సిన్‌ ఎఫికసీ కూడా చాలా ముఖ్యమైన విషయమని చీఫ్‌ ‌సైంటిస్ట్ ‌సౌమ్య తెలిపారు.  టీకా సామర్థ్యం ఎంత వరకు ఉంటుందో స్టడీ చేయాలన్నారు.  కనీసం 70 శాతం ప్రభావాన్ని టీకా చూపిస్తుందా లేదా గమనించాలన్నారు.  గరిష్టంగా 70 శతం, కనిష్టంగా 50 శాతం వ్యాక్సిన్‌ ఎఫికసీ ఉండాలని ఆమె అన్నారు. అంటే 50 శాతం కన్నా తక్కువ సామర్థ్యం ఉంటే ఆ వ్యాక్సిన్‌ ‌వాడడం అంత మంచికాదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ ‌సామర్థ్యంపై డబ్ల్యూహెచ్‌వో కొన్ని విధానాలను రూపొందించిందని, 50 శాతం కన్నా తక్కువ సామర్థ్యం ఉంటే అప్పుడు అది ప్రజల ఆరోగ్యాన్ని మార్చలేదన్నారు. హెచ్‌1ఎన్‌1 ‌మహమ్మారి సమయంలో ఏర్పడిన టీకా ప్రతిష్టంభన ఇప్పుడు ఏర్పడ కుండా చూడాలన్నారు. అప్పుడు సంపన్న దేశాలన్నీ వ్యాక్సిన్‌ ‌కొనుగోలు చేసి వాటిని ఆ తర్వాత పేద దేశాలకు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. 2021 తొలి అర్థభాగం ముగిసే వరకు మిలియన్ల సంఖ్యలో వ్యాక్సిన్‌ ‌డోస్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
వ్యాక్సిన్‌ ‌సరఫరా, వాడకం లాంటి సమస్యలు కూడా ఉంటాయన్నారు. ఏ వ్యాక్సిన్‌ ‌సక్సెస్‌ ‌రేటు ఎక్కువగా ఉంటుంది, దాని స్టోరేజ్‌ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి అనేది రిస్క్‌తో కూడుకున్నదని, ఒకే షాట్‌లో వ్యాక్సిన్‌ను తయారు చేయలేమన్నారు. ఇప్పటికీ చాలా వరకు వ్యాధులకు వ్యాక్సిన్‌ ‌లేదన్నారు. హెచ్‌ఐవీ, మలేరియా లాంటి వ్యాధులకు దశాబ్దాల పాటు టెస్టింగ్‌ ‌జరిగిందన్నారు. కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ ‌లేదు, అందుకే పూర్తి స్థాయిలో ట్రయల్స్ ‌జరుగుతున్నాయన్నారు. వైరస్‌ను ఇంకా పూర్తిగా స్టడీ చేయలేదని, అందుకే వ్యాక్సిన్‌ ‌రూపొందించేందుకు మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు డాక్టర్‌ ‌సౌమ్య అభిప్రాయపడ్డారు. మూడవ దశ ట్రయల్స్‌లో ఎఫకసీ ఫ్యాక్టర్‌ను పరిశీలించిన తర్వాత కానీ వ్యాక్సిన్‌ ఎం‌త వరకు సురక్షితమైందో చెప్పలేమన్నారు. అందుకే ఆర్నెళ్లా లేక ఏడాదా అన్న అంశాన్ని తేల్చలేమన్నారు. వ్యాక్సిన్‌ ఒక్కటే పరిష్కారం కాదు, ప్రజల్ని చైతన్య పరచాలన్నారు. వ్యాధి తీవ్రతను తగ్గించేది ఔషధాలు మాత్రమే అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ ‌సైంటిస్ట్ ‌సౌమ్య స్వామినాథన్‌ ‌తెలిపారు. అందుకే ఔషధాల  అంశంలోనూ ప్రయోగాలు జరుగుతున్నట్లు ఆమె వెల్లడించారు. మరణాలను తగ్గించేది ఔషధాలు మాత్రమే అని అన్నారు.  కొత్త తరహా డయాగ్నస్టిక్‌ ‌పరీక్షలు కూడా అవసరం అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply