Take a fresh look at your lifestyle.

పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు: ఏఎస్పీ

వనపర్తి,మే,18(ప్రజాతంత్ర విలేకరి): లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయటంలో భాగంగా రాత్రి పగలు తేడా లేకుండా నిర్విరామంగా శ్రమిస్తూ ప్రజల నుండి మన్ననలు అందుకుంటున్న జిల్లా పోలీసు సిబ్బంది తమ తమ అరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని అందుకోసం జిల్లా పోలీసుశాఖ తరపున సిబ్బంది ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని అందుకోసం జిల్లా పోలీసు శాఖ తరపున సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు ఎస్పీ షాకీర్‌ ‌హుసేన్‌ అన్నారు. సోమవారం రోజు వనపర్తి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా ఎస్పీ కె. అపూర్వరావు ఆదేశాల మేరకు వనపర్తి అదనపు ఎస్పీ షాకీర్‌ ‌హుసేన్‌ ‌వనపర్తి డిఎస్పీ కెయం. కిరణ్‌కుమార్‌ ‌వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది సహకారంతో వనపర్తి పట్టణ కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్‌ ‌హాలులో జిల్లాలోని మొత్తం పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంను జిల్లా అదనపు ఎస్పీ డీఎస్పీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదికార్లు ప్రారంభించారు.ఈ సందర్భంగా వనపర్తి అదనపు ఎస్పీ డిఎస్పీ పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు చేసేందుకు ముందుకు వచ్చిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతు గత 50 రోజులుగా జిల్లాలో లాక్‌డౌన్‌ ‌ను పకడ్భందీగా అమలు చేయడంలో పోలీసు సిబ్బంది రాత్రి పగలు తేడా లేకుండా నిర్వరామంగాశ్రమించడం జరిగిందని అన్నారు. సిబ్బంది తమ అరోగ్యం తగు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని క్షేత్రస్థాయిలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమం కొరకు శాఖ తరపున ప్రత్యేక శ్రద్ద చూపడంతో పాటు ఎప్పటికప్పుడు అందుకు అవసరమయిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.పోలీసు సిబ్బందికి వైద్య సిబ్బంది ద్వారా పరీక్షలు చేపట్టిన అనంతరం వాటిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా వైద్యా ధికారి మాట్లాడుతు జిల్లా పోలీసు సిబ్బందికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించడం మానసిక ఒత్తిడి లేకుండా తగు సూచనలు చేయడం జరిగింది. జిల్లాలో మొత్తం 340 మంది వైద్య పరీక్షలు నిర్వహించుకు న్నట్లు నిర్వహకులు తెలిపారు. సిబ్బంది నిర్వహణ పట్ల జిల్లా ఎస్పీ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ షాకీర్‌ ‌హుసేన్‌ ‌డిఎస్పీ కిరణ్‌కుమార్‌ ‌జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు జిల్లా ఆసుపత్రి సూపర్‌డెంట్‌ ‌హరిసాగర్‌ ‌చైతన్య గౌడ్‌, ‌సిఐ లు సూర్యానాయ క్‌, ‌మల్లికార్జున్‌రెడ్డి, సీతయ్య, ఎస్సై లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply