బ్లాక్ ఫంగస్ పై వైద్యనిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ,మే15: సకాలంలో బ్లాక్ ఫంగస్‌ను గుర్తించకపోయినా, చికిత్స అందించకపోయినా ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక కొరోనా చికిత్స సమయంలో అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల కొంతమంది పేషెంట్లు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ బారినపడుతున్నట్లు మెడికల్ పరిశోధనలు చెబుతున్నాయి. సరైన అవగాహన, త్వరగా వ్యాధిని గుర్తించడం ద్వారా బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టవచ్చని కేంద్రం తెలిపింది.
ఈ వ్యాధి అంతక ముందు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని వెల్లడించింది. అటు బ్లాక్ ఫంగస్ కొత్త వ్యాధి ఏమి కాదని దీనికి చికిత్స కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొరోనాతో ఉక్కిరిబిక్కిరివుతున్న భారత్‌ను కొత్త భయం వెంటాడుతోంది. ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్లాక్‌ఫంగస్ కొత్త ఆందోళన కలిగిస్తోంది.
కొరోనా నుంచి కోలుకున్నవారు ఈ ఇన్ఫెక్షన్ బారినపడుతుండటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్టాల్లో్ర ఈ కేసులు బయటపడ్డాయి. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొనడంతో కేందప్రభుత్వం దీనికి సంబంధించి కీలక సమాచారాన్ని షేర్ చేసింది.