ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్న వైద్యులు
సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్లో సీఎం కేసీఆర్కు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆయన ఆరోగ్యం సాధారణంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు వి•డియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఆరోగ్యం చాలా బాగుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది చేసే వైద్య పరీక్షలే ఆయన చేయించుకున్నారని తెలిపారు. ఊపిరితిత్తుల్లో మంట ఉండటంతో సిటీ స్కాన్ చేశామని రిపోర్ట్ శుక్రవారం వొస్తుందని ప్రకటించారు.
ఎంఐఆర్ స్కానింగ్ అవసరం లేదని, కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్కు ఊపిరితిత్తుల్లో మంటతో బాధపడుతున్నారు. ఆయన వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు, శ్వాసకోశ నిపుణుడు నవనీత సాగర్, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ సూచనలతో యశోద హాస్పిటల్ వెళ్లారు. వ్యాధి నిర్దారణ కోసం అక్కడ పలు పరీక్షలు చేశారు. సీఎం బ్లడ్ శాంపిల్స్ వైద్యులు తీసుకున్నారు. కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ హాస్పిటల్కు వొచ్చారు.