Take a fresh look at your lifestyle.

నేటి నుంచి మేడారం మహా జాతర

  • జన జాతరకు సర్వం సిద్ధం
  • నేడు గద్దెల మీదికి సారలమ్మ, రేపు సమ్మక్క రాక
  • 19న తిరిగి వనంలోకి..

ములుగు, ఫిబ్రవరి 15 (ప్రజాతంత్ర ప్రతినిధి): ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర-2022కు రంగం సిద్ధం అయింది. కొరోనా ఇబ్బందులు వున్నా జాతర నిర్వహణకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. జాతర జరుగుతుందో లేదో అని భక్తుల్లో ఉన్న అపోహలను మంత్రులు తొలగించారు. ఈ సారి జరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎ‌ర్రబెల్లి దయాకర్‌ ‌రావు, సీఎస్‌, ‌డీజీపీ ప్రకటించారు. మేడారం జాతర నిర్వహణతో పాటు జాతరకు వొచ్చే భక్తుల అవసరాల కోసం చేపట్టిన పనుల తీరు పైనా క్షేత్ర స్థాయిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో మహా జాతర నిర్వహణపై క్లారిటీ ఇచ్చారు. కొరోనా నేపథ్యంలో అమ్మవారి గద్దెలు, జంపన్న వాగులో శానిటేషన్‌ ‌పకడ్బందీగా చేపడుతూ ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర సాగిస్తామని స్పష్టం చేశారు. మహాజాతర నిర్వహించడానికి ఎలాంటి అడ్డంకులు లేవని మంత్రులు, అధికారులు స్పష్టం చేశారు. 4 రోజుల పాటు జరిగే మహాజాతర ఘట్టంలో కోటిన్నర మంది భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఏర్పట్లు చేశారు. ఇప్పటికే 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు తెలుస్తుంది. జాతర నిర్వహణ కోసం మొత్తం ప్రాంతాన్ని 8 జోన్లుగా, 34 సెక్టర్లుగా విభజించారు అధికారులు. 1100 ఎకరాల్లో 30 పార్కింగ్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జాతర సమయంలో పారిశుధ్య నిర్వహణకు 450 మంది సబ్‌ ‌సెక్టోరియల్‌ ఆఫీసర్లు, 50 మంది సెక్టరియల్‌ అధికారులను నియమించారు.

మొత్తం 4000 మందిని పారిశుధ్య నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్నారు. వీరితో పాటు జాతర సమయంలో దుమ్ము లేవకుండా ఉండడానికి 30 ట్రాక్టర్లు, చెత్త తొలగింపునకు 8 జేసీబీలు, 20 టాటా ఏస్‌ ‌వాహనాలతో సేకరించిన చెత్తను వినియోగించనున్నారు. డంప్‌ ‌యార్డుకు తరలించడానికి 70 ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. భక్తుల సౌకర్యం కోసం 200 డస్ట్ ‌బిన్స్ ‌సిద్ధం చేశారు. ఇక జాతరలో భక్తుల ఆరోగ్య పరిరక్షణకు 50 బెడ్లతో సమ్మక్క సారలమ్మ ప్రత్యేక వైద్యశాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న ఇంగ్లీష్‌ ‌మీడియం స్కూల్లో 6 పడకల వైద్యశాల, మరో 19 మెడికల్‌ ‌క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు.

Medaram Maha Jatara Upates

వీటితో పాటు ములుగులో, ఏటూరునాగారం, వైద్య విధాన పరిషత్‌ ‌హాస్పిటళ్లు, తాడ్వాయి10 పడకల ఆరోగ్య కేంద్రం, పస్రాలోని 5 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వినియోగించుకునేలా రెడీ చేశామన్నారు. ఇవి కాకుండా మేడారం వొచ్చే 8 మార్గాల్లో దారి పొడవునా 42 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర వైద్య సదుపాయం కోసం 15 అంబులెన్సులు, 15 బైక్‌ అం‌బులెన్సులను అందుబాటులో ఉంచారు. ఇక భక్తుల రక్షణ కోసం ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు గత జాతర మాదిరిగానే ఈసారి కూడా 10,300 మంది పోలీస్‌ ‌సిబ్బందిని జాతర నిర్వహణలో వినియోగించనున్నారు పోలీసు అధికారులు.

ప్రతి 4 కిలోమీటర్లకు ఒక పోలీస్‌ ‌క్యాంప్‌, ‌పస్రా నుంచి ప్రతి 2 కిలోమీటర్లకు ఒక పోలీస్‌ ‌క్యాంప్‌, ‌టోయింగ్‌ ‌వాహనాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంచారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 28.5 లక్షల వ్యయంతో తప్పిపోయిన వారి కోసం 6 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తుల రవాణా సదుపాయాల కోసం 3,845 బస్సులను సిద్దం చేశారు. జాతర కంటే ముందే భక్తులు మేడారంకు పోటెత్త్తారు. కొరోనా భయంతో ముందస్తు మొక్కులకు పెద్ద ఎత్తున భక్తులు మేడారంకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో మేడారం కిక్కిరిసిపోయింది. జాతర ప్రారంభానికి ముందే మేడారం భక్తులతో కళకళలాడుతుంది. మహబూబాబాద్‌ ‌జిల్లా గంగారం మండలం పునుగొండ్లలో ముస్తాబయ్యారు సమ్మక్క భర్త పగిడిద్దరాజు. పునుగొండ్లలో పెనుక వంశీయులు స్వామి వారి పడిగ తీసుకుని ఆటవీ మార్గం గుండా పస్రా, ప్రాజెక్టు నగర్‌, ‌కన్నేపల్లి మీదుగా 90కిలో మీటర్లు కాలినడకన మేడారం నేడు మధ్యాహ్నం వరకు చేరుకుంటారు. పగిడిద్దరాజు దేవాలయాన్ని ముస్తాబు చేయడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. రేపు సమ్మక్క గద్దెల మీదకు చేరుకోగా, 17న సారలమ్మ గద్దెలకు చేరుకుంటారు.

Leave a Reply