- ప్రభుత్వం ద్వారా అరటి,టమాటా పంపటల కొనుగోళ్లు
- వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి
రైతులకు నష్టం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా అరటి, టమాటా వంటి పంటలను ప్రభుత్వమే కొనుగోళ్లు చేస్తేందని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై సీఎం వైఎస్ జగన్ సక్ష నిర్వహించారని ఆయన వెల్లడించారు.గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో డియా సమావేశంలో మాట్లాడుతూ.. పంటలు చేతికొచ్చే సమయంలో కరోనా వైరస్ ప్రభావం పడిందని తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చెందారని.. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీఎం అన్ని చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ధాన్యాన్ని గ్రామాల్లో కొనుగోలు చేస్తున్నామని.. ఉత్పత్తులకు ఇబ్బంది లేకుండా రవాణా నిబంధనలను సడలించామని చెప్పారు.
రైతుబజార్లను సీఎం జగన్ ఎక్కడికక్కడ వికేంద్రీకరించారని.. మొబైల్ రైతుబజార్లను కూడా ఏర్పాటు చేశారని నాగిరెడ్డి వివరించారు. కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు అడుగుతున్నారు. ప్రధానితో ఆయన మాట్లాడినప్పుడు .. దేశమంతా రూ.5 వేలు ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయలేదని‘ నాగిరెడ్డి ప్రశ్నించారు రైతులకు చంద్రబాబు పెట్టిన బకాయిలను సీఎం జగన్ చెల్లించారన్నారు. చంద్రబాబు తన పబ్లిసిటీ కోసం రూ.కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని.. ఆయన పబ్లిసిటీ పిచ్చే 23 సీట్లకు పరిమితం చేసిందన్నారు. చంద్రబాబు హైదరాబాద్లో ఉండి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని.. ఆయన హైదరాబాద్లోని తన ఇంట్లో ఉంటే.. ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని ఎంవీఎస్ నాగిరెడ్డి దుయ్యబట్టారు.