Take a fresh look at your lifestyle.

ఆయుర్వేదంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చర్యలు

“కోవిడ్‌-19 ‌సంక్షోభ సమయంలో ఆయుష్‌ ‌మంత్రిత్వ శాఖ ప్రకటన నిత్యజీవితంలో మనం వాడే వస్తువుల విలువ తెలియక వాటిని వాడే వారిని చాదస్తులని అంటూ ఉంటాం. ఉదాహరణకు పసుపు వాడకం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వంటి సుగంధ ద్రవ్యాలలో శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. శొంఠి, మిరియాలు, వాడకం ఆరోగ్యప్రదం. 150 మిల్లీ లీటర్ల వేడి పాలలో పసుపు వేసుకుని తాగితే అనారోగ్య సమస్యలు తీరుతాయి.”

ఆయుర్వేదం తరతరాలుగా భారతీయ వైద్య సంప్రదాయం. కోవిడ్‌ -19 ‌ప్రభావం నేపథ్యంలో ఆయుర్వేదం గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. కోవిడ్‌-19 ‌సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలన్నీ మన ఆయుర్వేద విధానంలో ఉన్నాయి. శారీరక శుభ్రత, ఇతరల నుంచి దూరాన్ని పాటించడం, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయరాదన్న నియమాలన్నీ ఆయుర్వేదంలో ఉన్నాయి. అవి పాటిస్తే కోవిడ్‌-19 ‌వంటి వైరస్‌లు మన జోలికి రావు. ఆయుర్వేద వైద్యంలో వాడే మూలికలన్నీ ప్రకృతిలో లభ్యమయ్యేవే. కోవిడ్‌ -19 ‌నేపథ్యంలో బయట తిరగొద్దనీ, ఇంటి పట్టున ఉండాలని జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఆ నియమాలన్నీ తరతరాలుగా మన వారు పాటిస్తున్నారు. ఆయుష్‌ ‌స్వీయ రక్షణ మార్గదర్శకాలను సిఫార్సు చేస్తోంది. ముఖ్యంగా శ్వాసను బాగా తీసుకుని వదలాలని యోగ శాస్త్రం చెబుతోంది.

యోగాని ప్రాక్టీస్‌ ‌చేసే వారికి శ్వాస కోసం వ్యాధులు దరిచేరవు. రోజూ యోగాసనాలు వేస్తే, ప్రాణాయామం చేస్తే సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండవచ్చు. అలాగే, నిత్యజీవితంలో మనం వాడే వస్తువుల విలువ తెలియక వాటిని వాడే వారిని చాదస్తులని అంటూ ఉంటాం. ఉదాహరణకు పసుపు వాడకం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి వంటి సుగంధ ద్రవ్యాలలో శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. శొంఠి, మిరియాలు, వాడకం ఆరోగ్యప్రదం. 150 మిల్లీ లీటర్ల వేడి పాలలో పసుపు వేసుకుని తాగితే అనారోగ్య సమస్యలు తీరుతాయి. ఆయిల్‌ ‌పుల్లింగ్‌, ఆయిల్‌ ‌థెరిఫీలు కూడా ఆరోగ్యానికి మంచివి. పుదీనా, లవంగాల వాడకం వల్ల దగ్గు దరిచేరదు. ఈ ఆరోగ్య సూత్రాలను పాటిస్తే కోవిడ్‌-19 ‌వంటి వైరస్‌లు మన జోలికి రావని ఆయుర్వేద వైద్య శిఖామణులైన పద్మశ్రీ వైద్య పిఆర్‌ ‌కృష్ణకుమార్‌, ‌పద్మభూషణ్‌, ‌వైద్య దేవేంద్ర త్రిగుణ, వైద్య పిఎం వారియర్‌ ‌ప్రభృతులు సూచించారు. అయితే, ఈ సలహాలన్నీ కోవిడ్‌-19 ‌వైద్యం కోసం కాదు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!