Take a fresh look at your lifestyle.

అ‌క్రమంగా మోటర్లు వేస్తే చర్యలు

  • చౌటుప్పల్‌ ఆర్డీఓ సూరజ్‌ ‌కుమార్‌
  • ‌రైతులతో మాట్లాడుతున్న ఆర్‌డిఓ సూరజ్‌ ‌కుమార్‌, ‌తహశీల్దార్‌ ‌శ్రీనివాస్‌

అ‌క్రమంగా కాల్వలకు మోటర్లు వేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చౌటుప్పల్‌ ఆర్డీఓ సూరజ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని తుమ్మలగూడెం గ్రామంలో ఆసిఫ్‌ ‌నగర్‌ ‌కాల్వ నుండి అక్రమంగా నీటి పైప్‌ ‌లైన్‌ ‌ద్వారా నీటిని తరలిస్తున్నారని రైతులు రోడ్డుపై ఆందోళన చేయడంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వచ్చి పరిశీలించడం జరిగిందని, రైతుల అభిప్రాయాలను తీసుకున్నామని అన్నారు. ఈ సందర్భంగాఆర్డీఓ సూరజ్‌కుమార్‌ ‌విలేకరులతో మాట్లాడుతూ అనవసరంగా ఘర్షణలు పడకూడదని సమరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.

రైతులు ఎవరైనా సరే అక్రమంగా మోటర్లతో కాల్వలలో, చెరువులలో పైప్‌ ‌లైన్‌లతో నీటిని వినియోగించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ విషయమై నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఆసిఫ్‌ ‌నగర్‌, ‌ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాల్వలకు అక్రమంగా మోటర్లు వేయడంతో దిగువ ప్రాంత రైతులకు నీరు అందక ఇబ్బందులు ఎదుర్కుంటారని, కాల్వలపై ఇరుగేషన్‌ అధికారులు స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌చేపట్టి అక్రమ మోటర్ల తొలగిపు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా తుమ్మలగూడెం రైతులు మాట్లాడుతూ అక్రమ నీటి తరలింపు వల్ల తమకు సరిపడు నీరు అందవని గత్తకొంత కాలంనుండి నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని ఆర్డీఓకు విన్నవిన్నచారు. కాల్వ పరిదిలో సుమారు 250మంది రైతులు వందలాది ఎకరాల భూమిని సాగుచేస్తున్నారని అన్నారు. ఈ ఆయన వెంట తహశీల్దార్‌ ‌శ్రీనివాస్‌ ‌కుమార్‌, ‌తుమ్మలగూడెం రైతులు మందడి గోపాల్‌ ‌రెడ్డి, మల్లేశ్‌, ‌పుట్టల నర్సింహ్మ, రుద్రాల శంకరయ్య, జిల్లాల వెంకటేశం, ఎర్రం ఇలాజి, మర్రి శంకర్‌, ‌శేఖర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply