Take a fresh look at your lifestyle.

కరోనా వైరస్‌ ‌నిరోధానికి చర్యలు: మేయర్‌

కరోనా వైరస్‌ (‌కోవిడ్‌-19) ‌వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బల్దియా మేయర్‌ ‌గుండా ప్రకాశ రావు అభిప్రాయపడ్డారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్‌ ‌చాంబర్లో కమిషనర్‌ ‌పమేలా సత్పతి, మేయర్‌ ‌సానిటరీ ఇన్స్పెక్టర్‌ ‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ ‌మాట్లాడుతూ కరోనా అంటువ్యాధి అని, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ.హెచ్‌.ఓ) ‌దీన్ని మహమ్మారిగా ప్రకటించడం జరిగిందని, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 158 దేశాలలో ఈ వ్యాధి వ్యాప్తి చెందిందని, నగరంలో సుమారు 11 లక్షల జనాభా ఉందని నగర ప్రజలు వివిధ దేశాలలో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారని అలాంటి వారి పట్ల కొంత అప్రమత్తత అవసరం అని, వ్యాధి సోకిన వారు బయటకు రావడం వల్ల వారి నుండి వ్యాధి ఇతరులకు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. సానిటరీ ఇన్స్పెక్టర్‌ ‌క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యవంతం చేయాలని ప్రజలకు గైడెన్స్ ‌తో పాటు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలన్నారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గత నెల 25 నుండి ఈ నెల 13వ తేదీ వరకు సానిటేషన్‌ ‌సంబంధిత సమస్యల పరిష్కారం కోసం 60 ట్రాక్టర్లు, 45 జెసిబి లు, 43 డోజర్‌ ‌లు మొత్తంగా 120 వాహనాలను వినియోగించినట్లు, సానిటేషన్‌ ‌సంబంధిత కెమికల్స్, ‌మెటీరియల్స్ ‌ను సప్లయర్స్ ‌నుండి కొనుగోలు చేయాలని 300 పుష్‌ ‌కార్ట్ ‌లు, 60 డంపర్‌ ‌బిన్లు(పెద్దవి), 100 క్యాంపక్ట్ ‌బిన్లు(చిన్నవి), 800 పుష్‌ ‌కార్ట్ ‌బిన్‌ ‌లు, 250 వీల్‌ ‌బారోవర్స్ (‌డ్రైన్‌ ‌లను శుభ్రపర్చడానికి) అవసరమని ఆరోగ్య అధికారి తెలిపారు. ఈ సందర్భంగా మేయర్‌ ‌మాట్లాడుతూ పాలసీ సంబంధిత అంశాలకు సంబంధించి కౌన్సిల్‌ ఆమోదం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పారిశుధ్య కార్మికులకు అవసరమైన చీపుర్లు, జాకెట్లు తదితర అవసరాలు ఉంటే సూచించాలని ఎం.హెచ్‌.ఓ. ‌ను ఆదేశించారు. 2 స్వైపింగ్‌ ‌మిషన్‌ ‌లను జనరల్‌ ‌ఫండ్‌ ‌నుండి కొనుగోలు చేయాలని కమిషనర్‌ ‌ను ఆదేశించారు.

- Advertisement -

నాలాలను శుభ్రం చేయాలని, ఇందుకోసం రేని సీజన్‌ ‌యాక్షన్‌ ‌ప్లాన్‌ ‌ను రూపొందించాలని, ముంపునకు గురయ్యే ప్రాంతాలకు ముందుగా బడ్జెట్‌ ‌కేటాయించి చర్యలు తీసుకుంటే అట్టి ప్రాంతాలను ముంపునకు గురికాకుండా చూడవచ్చని మేయర్‌ అన్నారు. డిసిల్టింగ్‌ ‌చేయాలని, బాక్స్ ‌డ్రైన్‌ ‌లో పేరుకుపోయిన సిల్ట్ ఎప్పటికప్పుడు తొలగించాలని, మెకానిక్‌ ‌సంబంధ అంశాలు ఉంటే ఇంజనీరింగ్‌ ‌సిబ్బంది సహకారంతో పూర్తి చేయాలని మేయర్‌ అన్నారు. మాన్యువల్‌ ‌గా సిల్ట్ ‌తొలగింపు గురించి ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకొని అట్టి కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. ఆరోగ్య అధికారి డాక్టర్‌ ‌రాజారెడ్డి మాట్లాడుతూ ఇన్‌ ‌సానిటరీ టాయిలెట్లు నగరంలో 13 వేల వరకు ఉన్నాయని ఇటీవల ఆస్కి వారు చేసిన జి.ఐ.ఎస్‌ ‌సర్వే లో సుమారు 17% ఇన్‌ ‌సానిటరీ టాయిలెట్లు ఉన్నట్టు తేలిందని అన్నారు. ఈ సందర్భంగా మేయర్‌ ‌మాట్లాడుతూ ఇన్‌ ‌సానిటరీ టాయిలెట్‌ ‌లు ఉంటే అట్టి గృహాలకు పెనాల్టీలు విధించాలని మేయర్‌ అన్నారు.

కమిషనర్‌ ‌పమేలా సత్పతి మాట్లాడుతూ వెకెంట్‌ ‌ల్యాండ్‌ ‌టాక్స్ (‌వి.ఎల్‌.‌టి) కి సంబంధించి అలాంటి ల్యాండ్‌ ‌లను శుభ్రపరిచిన వెంటనే శానిటరీ ఇన్స్పెక్టర్లు బిల్‌ ‌కలెక్టర్‌ ‌లకు సమాచారాన్ని అందజేసేలా ఒక వాట్సప్‌ ‌గ్రూప్‌ ‌తయారు చేయాలన్నారు. దీనివల్ల రెండు విభాగాల మధ్య సమన్వయం పెరిగి పన్నుల వసూలు సులభతరం అవుతుందని అన్నారు. ట్రేడ్‌ ‌లైసెన్స్ ‌లకు సంబంధించిన సమాచారాన్ని డాష్‌ ‌బోర్డు లో రెగ్యులర్‌ ‌గా పొందుపరచాలని లైసెన్సు క్యాన్సిల్‌ ‌చేసిన వెంటనే అట్టి సమాచారం అందులో నుండి తొలగించేల సాఫ్ట్ ‌వేర్‌ ‌రూపొందించాలని ఐ.టి. మేనేజర్‌ ‌ను కమిషనర్‌ ఆదేశించారు. వివిధ డివిజన్లలో పనిచేస్తున్న మలేరియా సిబ్బంది సానిటరీ ఇన్స్పెక్టర్‌ ‌పర్యవేక్షణలో విధులు నిర్వర్తించాలని, హెల్త్ ఇన్స్పెక్టర్‌ ‌ల హాజరు ఆయా డివిజన్‌ ‌ల ఎస్‌.ఐ. ‌ల పరిధిలోని ఉండేలా చూడాలని కమీషనర్‌ ఎం.‌హెచ్‌.ఓ. ‌ను ఆదేశించారు. వివిధ రకాల కొనుగోళ్లకు సంబంధించిన అంశాలను ఈ నెల 26న జరిగే కౌన్సిల్‌ ‌సమావేశంలో ఎజెండా అంశాలు (ప్రియంబుల్స్)‌గా నమోదు చేయాలని మేయర్‌ ‌సెక్రెటరీ ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ ‌సి.హెచ్‌. ‌నాగేశ్వర్‌, ఆర్‌.ఎఫ్‌.ఓ. ‌జి.వి.నారాయణ రావు, ఎం.హెచ్‌.ఓ. ‌డా.రాజారెడ్డి, సెక్రెటరీ విజయలక్ష్మి, శానిటరీ సూపర్వైజర్‌ ‌సుధాకర్‌, ‌సూపరిండెంట్‌ ‌షేహజాది బేగం, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply