Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడికి చర్యలు: కోన రఘుపతి

‌కరోనా మహమ్మారిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ ‌కోన రఘుపతి అన్నారు. మంగళవారం నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభం కావడంతో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలలో భాగంగా సోమవారం నగరంపాలెంలోని ఆర్‌ అం‌డ్‌ ‌బీ అతిథి గృహంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డెప్యూటీ స్పీకర్‌ ‌కోన రఘుపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహించారని చెప్పారు.

Leave a Reply