Take a fresh look at your lifestyle.

మేయర్ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం.. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

జీహెచ్ఎంసీ ఎన్నికలో రిజర్వేషన్లు బట్టి మేయర్ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. డివిజన్ అధ్యక్షులు ఈ నెల 18వ తేది లోగా డివిజన్ కమిటీ లు పూర్తి చేయాలని అన్నారు.శుక్రవారం ఇందిరాభవన్ లో జరిగిన గ్రేటర్ మీటింగ్ లో పాల్గొన్న ఉత్తమ్ మాట్లాడుతూ …బ్లాక్ కమిటీ లు కూడా వెంటనే  పూర్తి చేసి  సిటీ, జిల్లా అధ్యక్షులకు అందజేయాలని తెలిపారు.

డివిజన్లలో అభ్యర్థులు ఎవరో ముందుగానే నిర్ణయించుకోవాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆరేళ్లుగా ప్రజలు చూస్తున్నారని మాటలు తప్ప కేసీఆర్ ఏమి చేయరని తేలిపోయిందని విమర్శించారు.ప్రజలు టిఆర్ఎస్ పాలన పట్ల తీవ్ర నిరసనతో ఉన్నారని ఏ మొహంతో ఓట్లు అడుగుతారని టిఆర్ఎస్ నేతలను నిలదీయాలన్నారు. కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన కాంగ్రెస్ నేతలందరూ అండగా నిలబడుతామని హైద్రాబాద్ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని ఉత్తమ్ అన్నారు.

Leave a Reply