Take a fresh look at your lifestyle.

టిఆర్‌ఎస్‌ ‌గ్రేటర్‌ ‌రెండో జాబితా విడుదల

టికెట్‌ ‌రాకుండానే నామినేషన్‌ ‌వేసిన మేయర్‌ ‌భార్య
‌గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌(‌జీహెచ్‌ఎం‌సీ) ఎన్నికల్లో పోటీ చేసే రెండో జాబితాను టీఆర్‌ఎస్‌ ‌గురువారం విడుదల చేసింది. 20 మందితో రెండో జాబితాను ప్రకటించింది. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఇప్పటి వరకు 125 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో లేనివారు సైతం కొందరు నామినేషన్లు వేశారు. చర్లపల్లి నుంచి మేయర్‌ ‌బొంతు రామ్మోమన్‌ ‌భార్య నామినేషన్‌ ‌వేయడం గమనార్హం. తనకు టిక్కెట్‌ ‌వొస్తుందన్న ఆశ ఉందని, ఈరోజు మంచిగా ఉండడంతో నామినేషన్‌ ‌వేశానని ఆమె అన్నారు.

Leave a Reply