Take a fresh look at your lifestyle.

మేడే స్ఫూర్తితో పోరాటం ఉధృతం

తాండూరు : మేడే స్ఫూర్తితో పోరాటాలను మరింత మరింత ఉధృతం చేయాలని సిఐటియు వికారాబాద్‌ ‌జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం మే డే సందర్భంగా సీఐటీయు, సిపిఎం ఆధ్వర్యంలో తాండూర్‌ ‌పట్టణంలో అంబేద్కర్‌ ‌చెక్‌ ‌దగ్గర తాండూరు రూరల్‌ ‌భెల్కటూర్‌ ‌గ్రామంలో మేడే జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల పోరాటాల నుండి పుట్టింది మే డే అని, సంపద సృష్టికి మూలం కార్మిక వర్గమని పేర్కొన్నారు.

రోజుకు ఎనిమిది గంటల పని దినం కోసం ఆనాటి పాలకుల మెడలు వంచి కార్మికులు సాధించుకున్నారని ఆయన గుర్తు చేశారు. తమ హక్కుల కోసం వందల మంది కార్మిక వీరులు ప్రాణత్యాగం చేసినట్లు తెలిపారు. ఇప్పుడున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొరోనా కష్టాల్లో కూడా ఎనిమిది గంటల పనిని 12 గంటలకు పెంచుతూ యజమానులకు పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారని అన్నారు. అసంఘటిత కార్మికులు, వలస కార్మికులను ఆదుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కనీస వేతనాలు అమలు చేయకుండా సుప్రీమ్‌కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. పేద ప్రజలకు, కార్మికులకు విద్య, వైద్యాన్ని కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి కౌన్సిలర్‌ ‌సోమశేఖర్‌ ‌బాల రామ్‌, ‌సిఐటియు సిపిఎం నాయకులు వెంకటేష్‌, ‌మహబూబ్‌, ‌కార్మికులు వెంకటయ్య, వెంకటప్ప, ఆర్టీసీ కార్మికులు లక్ష్మణ్‌, ‌భాష తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!