Take a fresh look at your lifestyle.

కార్మికుల అత్మగౌరవానికి ప్రతీక మే డే

మేడే అనేది కార్మీక వర్గానికి అత్మగౌరవం,పవిత్ర పండుగ వంటిదని ములుగు ఎమ్మేల్యే సీతక్క అన్నారు. శుక్రవారం ఏఐటి యుసీ అద్వర్యంలో జరిగిన 134వ మేడే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరై జెండా అవిష్కరించారు. అనం తరం 60 మంది హమాలీ కుటుంబాలకు బియ్యం, కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మేడే అంటే కార్మీకుల సమస్యలపై ప్రశ్నించే తత్వం పోరాట పటిమను రగిలించే రోజని అన్నారు. ఏఐటియుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్‌ ‌మాట్లాడుతూ నేడు కార్పోరేట్‌ ‌ప్రభుత్వాల వలన మల్లి 8 గంటల పనిదినం కోసం పోరాటాలు చేయ్యాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా ఎంత అభివృద్ది చెందినా కార్మీకులు,కర్షకులు,వృత్తిదారులు లేని సమాజాన్ని ఎవరు ఊహించలేరన్నారు.కార్మీకులను ఆదుకోవడంలో బాగంగా సీతక్క చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.  ఈ సందర్బంగా ములుగు, మల్లంపల్లి,ప్రేమనగర్‌ ‌గ్రా మాలలో జెండాలను అవిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్‌ ‌పార్టీ ములుగు జిల్లా అద్యక్షులు నల్లేల కుమారస్వామి, ఏఐటియుసి నాయకులు ముత్యాల రాజు, ఇంజం కోమురయ్య, నాగరాజు, రాజ్‌కుమార్‌, ‌జక్కుల అయిలయ్య, రామన్న, మిర్యాల రవి, రంజిత్‌, ‌ప్రకాశ్‌, ‌మొగిలి, రాజయ•, సదయ్య, అశోక్‌, ‌లింగయ్య, చిన్న వేణు, రఘు, ఓదేలు,ఐలుకోమురు,పైడి,సారయ్యలు పాల్గోన్నారు.

మరిపెడలో…
మరిపెడ, మే1,(ప్రజాతంత్ర విలేకరి):ఎర్ర జెండా నాయకత్వన కార్మికుల హక్కుల సాధనకై సమిష్టి పోరాటాలు నిర్వహించాలని సీపీఎం మరిపెడ టౌన్‌ ఇం‌చార్జి ఐనాల పరశురాములు పిలుపునిచ్చారు. శుక్రవారం మరిపెడ మున్సిపల్‌ ‌కేంద్రంలోని ట్యాంక్‌ ‌సెంటర్‌లో మేడే సందర్భంగా సీపీఎం, సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు (భవణ నిర్మాణ కార్మిక సంఘ)అధ్యక్షులు బండ వీరస్వామి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధులుగా ఐనాల పరశురాములు పాల్గొని జెండా అవిష్కరించి అనంతరం మాట్లాడారు. నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మికుల వ్యతిరేకవిధానాలను ఎండ• •ట్టి తమ హక్కులను న్యాయమైన కోర్కెలను సాదించుకొ నుటకు కార్మికులందరూ సమిస్టిపొరటాలు నిర్వహించా లని పిలుపునిచ్చారు. కార్యక్రమములో సీపీఎం , సీఐటీ యూ నాయకులు, భవన  నిర్మాణ కార్మిక సంఘము అధ్యక్ష ,కార్యదర్శులు వీరస్వామి ,కర్నె వెంకన్న ,ఉపాధ్యక్షులు  ఏడెల్లి లింగన్న ,నాయకులు సుంకరి రవి , చిదుముల వెంకన్న ,భాషిపంగు నగేష్‌ ,‌భాషిపంగు లక్మన్‌ ,‌భాషిపంగు శ్రీను ,పేరాల ఉపేందర్‌ ,ఏడెల్లి వీరన్న ,జినక వెంకన్న ,సురారపు మహేష్‌ ‌సురబోయిన భిక్షం తదితరులు పాల్గొన్నారు.

గూడూరులో…
గూడూరు మే 1 (ప్రజాతంత్ర విలేకరి) : గృహ నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని మండల తాపీ సంఘం అధ్యక్షులు ఎండి అంకూస్‌ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని తాపీ సంఘం ఆధ్వర్యంలో సామాజిక దూరం పాటిస్తూ కార్మిక జెండాను ఎగురవే శారు. కార్యక్రమంలో మండల తాపీ సంఘం గౌరవ అధ్యక్షులు మాజీ ఎంపీపీ చెల్పూర్‌ ‌వెంకన్న, కోశాధికారి ఎం.డి హుస్సేన్‌, ‌కార్యదర్శి నెల్లుట్లవెంకన్న, ఉపాధ్యక్షుడు చెల్పూర్‌ ‌శ్రీశైలం ,ఎర్ర యాకూబ్‌, ‌షేక్‌ ‌జానీ మాజీఅధ్యక్షులు సాంబమూర్తి, రాజు పాల్గొన్నారు.

నెల్లికుదురులో…
నెల్లికుదురు ఏప్రిల్‌ 30 (‌ప్రజాతంత్ర విలేకరి) : మండల కేంద్రమైన నెల్లికుదురు తో పాటు ఆయా గ్రామాల్లో  మేడే దినోత్సవాన్ని కార్మికులు సిఐటి యు, ఏ ఐటి యు సి, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీపార్టీల ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేసి ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా యూనియన్‌ ‌నాయకులు, పార్టీల కార్యదర్శులు మాట్లాడుతూ నాటి నుంచి నేటి వరకు పాలకులు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని, వాటి సాధన కోసం  పోరాటాలే మార్గమని అన్నారు. మం డలంలోని నైనాలలో మహబూబాబాద్‌ ‌ప్రాంత పోరాటయోధుడు సిపిఎం నేత స్వర్గీయ పెరమండ్ల జగన్నాథం చారిటబుల్‌ ‌ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు, పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో నాయకులు  వరిపల్లి వెంకన్న, పెరుమండ్ల తిలక్‌ ‌గౌడ్‌, ‌ముంజంపల్లి వీరన్న, పెరుమాండ్ల బాబు గౌడ్‌, ‌వెంకన్న, లక్ష్మి నరసమ్మ, పద్మ, కృష్ణమూర్తి,  స్వామి, తదితరులు ఉన్నారు,

నర్సంపేటలో…
నర్సంపేట, మే 01, (ప్రజాతంత్ర విలేకరి) : అన్ని వర్గాల కార్మికుల హక్కులను కాపాడుతానని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మేడే సందర్బంగా నర్సంపేట వ్యవసాయ గ్రేన్‌ ‌మార్కెట్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి కార్మికులందరికీ శుభాకాంక్షలు ఆయన  తెలియచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకు న్నటువంటి, హక్కులు కల్పించుకున్న ప్రత్యేక దినం మేడేనని ఆయన తెలిపారు. అనంతరం నియోజక వర్గంలోని వివిధ వర్గాల్లో పనిచేస్తున్న 2వేల మంది కార్మికులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పండ్లు, నిత్యా వసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌గుంటి రజిని కిషన్‌, ‌టీఆరెస్‌కేవీ రాష్ట్ర నాయకులు నల్లా భారతి, గోనె యువరాజ్‌, ‌కొల్లూరి లక్ష్మినారాయణ, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు నాయిని నర్సయ్య, పాలడుగుల రమేష్‌  ‌పాల్గొన్నారు.

నెక్కొండలో…..
ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఏఐటీ యూసీ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కందిక చెన్నకేశవులు జెండాను ఆవిష్కరించారు. పిఎసిఎస్‌ ‌చైర్మన్‌ ‌మారం రాము, సుధాకర్‌, ‌లింగయ్య పాల్గొన్నారు. అదేవిధంగా వామపక్షాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కామ్రేడ్‌ ‌లక్ష్మయ్య స్మారక స్థూపం వద్ద అరుణ పతాకాన్ని ఎగుర వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌, ‌సిపిఎం, సిపిఐ, ఎంసిపిఐ, సిఐటియు, ఎఐటియుసి, నాయకులు పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర కౌన్సిల్‌ ‌సభ్యులు ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య స్థానిక మండల కేంద్రంలో జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ‌సొంటిరెడ్డి యమునరంజిత్‌ ‌రెడ్డి, ఈదునూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

చెన్నారావుపేటలో….
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు స్వామి , సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పరికి మధుకర్‌ ‌మేడే సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ జెండాల ను ఆవిష్కరించారు, కార్యక్రమంలో నాయకులు ఏనుగు తల నరేష్‌, ‌కుక్కల సతీష్‌, ‌గుండ్లపల్లి స్వామి, చిన్న రాజ్‌ ‌కుమార్‌, ‌గార్నాపెళ్లి మధు, గునిగంటి అనిల్‌, ‌గుల్లపెళ్లి మధు, అజయ్‌, ‌శ్రీకాంత్‌, ‌మెరుగు అఖిల్‌, ‌సారంగం, అడ్డ గట్ల మంజుల, పూలమ్మ, నాగమణి, విజయ, ఆకుల ముత్యాలు, కొత్తపెళ్లి అఖిల్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply