Take a fresh look at your lifestyle.

మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

పొగాకు వద్దు..ఆరోగ్యం ముద్దు.. పొగాకు ప్రజారోగ్యానికి అతిపెద్ద శత్రువు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ‌ప్రతి సంవత్సరం మే 31 రోజున ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం (డబ్ల్యూఎన్‌టీడీ) నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యతిరేక దినోత్సవం 2020 ‘‘పరిశ్రమల తారుమారు నుండి యువతను రక్షించడం మరియు పొగాకు మరియు నికోటిన్‌ ‌వాడకం నుండి వారిని నిరోధించడం’’ అనే లక్ష్యంగా ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం ప్రతి సంవత్సరం మే 31 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పొగాకు మహమ్మారి వలన ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటి సారిగా 1987 లో పొగాకు రహిత ప్రపంచ ఏర్పాటు కోసం సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ 7 ఏప్రిల్‌ 1988 ‌ను ‘‘ప్రపంచ పొగాకు రహిత దినం’’ గా పిలిచే తీర్మానాన్ని ఆమోదించింది. 1988 నుండి ప్రతి సంవత్సరం మే 31 న ప్రపంచ పొగాకు రహిత దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పొగాకు సంబంధిత ఆరోగ్య సమస్యల నుండి మరణాలను తగ్గించడం దీని ప్రధానమైన లక్ష్యం.

పొగాకు ప్రజారోగ్యానికి అతిపెద్ద శత్రువు: పొగాకు నేడు ప్రజారోగ్యానికి అతిపెద్ద శత్రువు. పొగాకు వాడడం వల్ల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావంతో ఊపిరితిత్తులు పాడై మరణానికి దారితీస్తుంది, ప్రపంచంలో మరణానికి రెండవ ప్రధాన కారణం పొగాకు. ఈ రోజు క్రమం తప్పకుండా ధూమపానం చేసే సగం మంది (సుమారు 650 మిలియన్ల మంది) చివరికి పొగాకుతో చంపబడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. పీల్చేవారికీ ప్రమాదమే: పొగ తాగేవారి కంటే పీల్చేవారు తీవ్ర అనారోగ్యా ల బారినపడే అవకాశం ఉంది. పొగతాగేవారిని యాక్టివ్‌ ‌స్మోకర్లుగా, పీల్చేవారిని పాసివ్‌ ‌స్మోకర్లుగా పిలుస్తారు. తాగే వాడికన్నా గుప్పు గుప్పు మంటూ వదిలే పొగ పీల్చిన వ్యక్తులకు సైతం ఆయుక్షీణం కలుగుతోంది. పొగ పీల్చడంవల్ల మహిళల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. ఎక్కువ పీల్చడం వల్ల అబార్షన్లు జరగడం. ఒకవేళ పిండం ఎదిగినా చివర్లో మృతిచెందిన శిశువులు జన్మించడం వంటి సమస్యలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో 2.5 కోట్ల మంది పొగతాగేవారున్నట్లు అంచనా. ఒక సిగరెట్‌ ‌తాగితే 43 రకాల విష వాయువులు వెలువడుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

ధూమపానం ప్రాణాంతకమే: ధూమపానం వల్ల వ్యక్తులలో నోటి కాన్సర్‌, ‌దంతవ్యాధులు, ఉపిరి తిత్తుల క్యాన్సర్‌, ఉదరకోశ వ్యాధులు, అల్సర్‌ , ‌గ్యాస్‌ ‌ట్రబుల్‌, ఉదరకోశ క్యాన్సర్‌ ‌సోకే అవకాశాలు ఎక్కువ. సెకండ్‌ ‌హ్యాండ్‌ ‌స్మోకింగ్‌ ‌కారణంగా పిల్లల్లో ఆస్తమా రోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. గుండెకు సంబంధించిన రక్త నాళాలు దెబ్బతిని రక్తపోటు, గుండెపోటు సంభవిస్తాయి. మెదడులోని రక్తనాళాలు చిట్లి పక్షవాతం, నరాల బలహీనత ఏర్పడే ప్రమాదం ఉంది. పిల్లల్లో వినికిడి, మాట్లాడే సమస్యలు తలెత్తుతాయి. ధూమపానం చేసేవారిండ్లలో ఉన్న పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి.

ధూమపానం మానేయడానికి చిట్కాలు: ధూమపానం మానేయడం అసాధ్యమైనదేమి కాదు.ధూమపానం మానేయాలనే ఆలోచన వచ్చింది అంటేనే మీరు ఒక మెట్టును ఎక్కినట్లే. కొన్ని చిట్కాలు పాటిస్తే సులభంగా పొగాకును దరిచేరనీయకుండా చేయవచ్చు.

  1. ప్లానింగ్‌ ఉం‌డాలి: పొగతాగడం మానేయాలనుకోవడం మంచి నిర్ణయమే. పొగతాగడం మానేయాలనే ఆలోచనను ఆచరణలో పెట్టాలంటే మాత్రం తప్పకుండా ప్రణాళిక రూపొందించుకోవాలి. ధూమపానం మానేయాలనే ఆలోచన మరల సమీక్షించి, మే 31 పొగాకు రహిత దినోత్సవం రోజున గట్టి నిర్ణయం తీసుకొని దీనికి అనుగుణంగా తగు రీతిలో ప్లానింగ్‌ ‌ను రూపొందించుకోవాలి. ఎలాంటి పరిస్తితులనైనా రూపొందించుకున్న ప్లానింగ్‌ ‌కు తగ్గట్టుగా మలచుకోవాలి. గుర్తుంచుకోండి: పొగ తాగే వ్యసన పరులందరికీ ఒకే రకమైన నియమాలు పనిచేయవనే విషయాన్ని ముందుగా గుర్తించడం మంచిది. పొగతాగడాన్ని ఎందుకు మానేయాలనుకుంటున్నారో మిమ్నల్ని మీరే ప్రశ్నించుకోవాలి. మీ బలాలు, బలహీనతలను తెలుసుకోండి. మీ అవసరాల గురించి నిజాయితీగా ఉండండి.
  2. సపోర్టు తీసుకోవాలి: పొగ లేకుండా ఉండటానికి మీరు ఒంటరిగా జీవితాన్ని గడపవద్దు. ప్రతి రోజు ఎన్నో రకాల పనులను చేస్తూ ఉంటారు. చేయగలిగే పనులు ఉన్నాయి. ధూమపానం వదిలేసిన నిర్ణయం కుటుంబ సభ్యులకు, సహోధ్యోగులకు, ఆత్మీయ మిత్రులకు తెలియ పరచండి. మీ పట్ల సానుకూల వ్యక్తులతో పంచుకోండి. వారి సపోర్ట్ ‌ను తీసుకోవాలి. మీ మిత్రులకు ధూమపానం మానేయాలని, ధూమపానం చేసేవారితో మీ దగ్గరగా పొగతాగవద్దని, సిగరెట్లు తనకు ఇవ్వవద్దని సున్నితంగా చెప్పండి. ఇద్దరు స్నేహితులు కలిసి ధూమపానం మానేయడం చాలా సులభం.
  3. బిజీగా ఉండాలి: ప్రత్యేకంగా పొగ మానేయాలనుకున్న రోజున పొగ లేకుండా ఉండటానికి బిజీగా ఉండటం గొప్ప మార్గం. బిజీగా ఉండటం వల్ల మనస్సు ధూమపానం నుండి దూరంగా ఉండటానికి ప్రోత్సహిస్తుంది. పొగాకు కోరికల నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది. బిజీ షెడ్యూల్‌ ‌ముందుగానే తయారు చేసుకోవాలి. ప్రశాంత వాతావరణంలో వ్యాయామం, వాకింగ్‌ ‌చేయాలి. పుస్తక పఠనం, రాత పని, క్యారం చెస్‌ ‌లాంటి ఇండోర్‌ ‌గేమ్స్ ‌పై దృష్టి సారించాలి. ధూమపానం చేయని స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి.
  4. ధూమపాన ట్రిగ్గర్‌లను నివారించండి: సిగరెట్‌ ‌తాగడానికి మిమ్మల్ని ఏ పరిస్థితులు ప్రేరేపిస్తున్నాయో గమనించండి. సిగరేట్లు మానేయడం సులువే. పొగతాగడం మానివేసే సమయంలో ఉత్పన్నమయ్యే అసహనం, ఆందోళన వంటి లక్షణాలు అగుపిస్తాయి. వీటిని ధృఢసంకల్పంతో, ధీమాగా ఎదుర్కొవాలి. పార్టీలు, మద్యపానం లేదా కాఫీ కోసం బయటికి వెళ్లడం వంటి పొగత్రాగే పరిస్థితులను నివారించడానికి ప్రయత్నించండి, లేదా రెస్టారెంట్లలో ధూమపానం చేయని విభాగంలో కూర్చోవడానికి ప్రయత్నించండి.
  5. సానుకూలంగా ఉండాలి: ధూమపానం మానేయడం కష్టం. అంత మాత్రాన అసాధ్యమైనదేమి కాదు. ఇది ఒక నిమిషం.. ఒక గంట.. ఒక రోజు ఇలా మెల్లిగా తమ ఆలోచనలు ధూమపానం నకు దూరంగా ఉండునట్లు పెంచుకోవాలి. ధూమపానం నకు దూరంగా ఉన్న ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు ను తనకు తానుగా అభినందించుకోవాలి. సానుకూల ఆలోచన లతో ముందుకు వెళ్లాలి.
  6. ధూమపానం మానేయడానికి కారణాలు రాసుకోవాలి: ధూమపానం మానేయాలనే ఆలోచన రావడానికి గల కారణాలు రాసుకోవాలి. అప్పుడప్పుడు వాటిని గుర్తుకు తెచ్చుకోవాలి. ఊపిరితిత్తులు పాడైపోయాయి అని డాక్టర్‌ ‌చెప్పిన సందర్భం, కుటుంబ సభ్యుల ఆనందం గా ఉంచడం, ప్రెగ్నెన్సీ సమయం, డబ్బు ఆదా కోసం తదితర కారణాల మూలంగా ధూమపానం మానాలనుకుంటే ఈ కారణాలు గుర్తుకు తెచ్చుకోవడం వల్ల పొగాకు మానేయాలనే కోరిక బలంగా తయారవుతుంది.
  7. ధూమపానం ఆలోచన లు వచ్చినపుడు 4 ణలను గుర్తుంచుకోవాలి: D- Delay•(ఆలస్యం): చెడు కోరికలు, ఆలోచనలు కొద్ది క్షణాలు మాత్రమే ఉంటాయని గుర్తుంచుకోండి. ఆ క్షణం లో కలిగిన ధూమపానం చేయాలనే ఆలోచన వాయిదా వేయండి.
  8. D – Deep Breathing: డీప్‌ ‌బ్రీతింగ్‌ ‌మనస్సును విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతత పొందవచ్చు. ఇతర పనుల పై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.

D – Drink water నీరు త్రాగండి: పుష్కలంగా నీరును త్రాగడం ద్వారా శరీర వ్యవస్థ లో నుండి నికోటిన్‌ ‌మరియు ఇతర టాక్సిన్స్ ‌ను బయటకు పంపడానికి దోహదపడుతుంది. ఆరోగ్య వ్యవస్థ మెరుగు పడుతుంది.
D – Do some thing else ఇంకేమైనా చేయండి: ఉదయం నడక కోసం, ఖాళీ సమయం దొరికితే సినిమాలకు వెళ్లవచ్చు. సాధారణంగా సిగరెట్‌ ‌త్రాగాలనే ఆలోచన వచ్చినపుడు ఆపిల్‌ ‌తినడానికి లేదా పళ్ళు బ్రష్‌ ‌చేయడానికి ప్రయత్నించండి. వీలైతే కౌన్సెలింగ్‌ ‌తీసుకోవాలి*

Leave a Reply