Take a fresh look at your lifestyle.

మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ..

“సెకండ్‌హ్యాండ్‌ ‌స్మోక్‌ అనేది మహా ప్రమాదకరం.పొగ తాగే వారికి ఎంత హానికరమో ఆ పొగను పీల్చిన ఇతరులకు కూడా అంతే హానికరము .పొగాకులో 4వేల రకాల రసాయనాలుంటాయి.వాటి ద్వారా మనిషికి 60 రకాలైన క్యాన్సర్‌ ‌వ్యాదులు వస్తాయి.నోటి క్యాన్సర్‌,‌కాలేయ క్యాన్సర్‌,ఊపిరితిత్తుల క్యాన్సర్‌,‌గుండె వ్యాదులు,పాదాలు కుళ్లిపోవడం,అల్జీమర్‌ ‌వ్యాదులు మగవారిలో జడత్వం కలిగి పిల్లలు పుట్టే సామర్ద్యాన్ని కోల్పోవడం,ఆడవారిలో సంతానాన్ని కనే శక్తిని కోల్పోవడం పొగ తాగే ఆడవారి పిల్లలు తక్కువ బరువుతో పుట్టి జీవితాంతం రిస్కును ఎదుర్కోవడం జరుగుతుంది.గర్బాశయ క్యాన్సర్‌, ‌మధుమేహం వంటి రోగాలు వస్తాయి.”

పొగాకు ఉత్పత్తులు నరకానికి రహదారులు

  • పొగతాగే వారి కన్నా పొగ పీల్చేవారికే అపాయం ఎక్కువ
  • ప్రచారం లేక కఠిన చట్టాలు లేక ప్రాణాలు కోల్పోతున్న సామాన్యులు

పొగ తాగడం ఆరోగ్యానకి హానికరంSmoking is injuries to health)అనే సామెతను ఎవరు పట్టించుకోవడం లేదు.పొగ తాగే వారి కన్నా పీల్చేవారి జీవితాలకే ప్రమాదం ఎక్కువ సరైన ప్రణాళిక లేకపోవడంతో లక్షలాది మంది జీవితాలలో చావు గంటలు మోగుతున్నాయి.పొగాకు నియంత్రణ చట్టం నిబందనలు కఠినంగా లేకపోవడంతో వ్యాదుల విజృంభణ పెరిగిపోతున్నది.సిగరెట్‌ ‌బాక్సులు.బీడీచుట్టలపై పొగాకు ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం అంటూ తాటికాయ అంతా అక్షరాలతో లెబుల్స్ ‌ముద్రించి ఉన్నప్పటికి పొగరాయుల్లు గుట్టుచప్పుడు కాకుండా హోటలల్లోను, బస్టాండ్‌ల్లోను గుట్టు చప్పుడు కాకుండా పొ• •తాగుతున్నారు.భారతదేశంలో సుమారు 27 కోట్ల మంది స్త్రీ పురుషులు పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారు.ఈ పొగ తాగడం వల్ల ప్రతి సంవత్సరం విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.పొగాకు వాడటం దేశాబివృద్దికి విఘాతం అని కుటుంబానికి వినాశనం అని ప్రచారం జరుగుతున్న పొగరాయుల్లు తమ ప్రవర్తనను మార్చుకోవడం లేదు.ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ యేట పొగాకు ఉత్పత్తులను వాడటం ద్వారా 60లక్షల మంది ప్రాణాలు హరిమంటున్నాయి.అయిన తగినంతా ప్రచారం జరుగడం లేదు.భారతదేశంలో ప్రతి రోజు 2200 మంది దేశంలో 10 లక్షల మంది ప్రాణాలు యేట గాలిలో కలిసిపోతున్నాయి.వారి మీద ఆదారపడిన కుటుంబాలు బ్రతుకుదెరువు లేక బజారున పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.సిగరెట్లు,పొగాకు,పాన్లు నమలడం జర్దాలు,గుట్కాలు వాడటం వల్ల శరీర అవయవాలు దెబ్బతిని అకాల మరణానికి లోనవుతున్నారు.ప్రపంచంలో ఎక్కువ మంది నోటి క్యాన్సర్‌తో మృతి చెందు తున్నారు.అయితే భారతదేశంలో అన్ని దేశాల కంటే నోటి క్యాన్సర్‌తో చనిపోయే సంఖ్యలో ప్రపంచంలోనే నెంబర్‌వన్లో ఉండటం మన దురదృష్టం క్యాన్సర్‌ ‌మరణాల్లో 90% మరణాలు పొగాకును సేవించడం ద్వారానే సంభవి స్తున్నాయని జాతీయ పొగాకు నియంత్రణ మండలి పేర్కొన్నది.ఢిల్లీలోని జాతీయ పొగాకు నియంత్రణ మండలి ఆద్వర్యంలో రాష్ట్రాలలోను,జిల్లాలలోను పొగాకు నియంత్రణ మండళ్లు ఉన్నప్పటికి తగిన ప్రచారం అవగాహాన లేక చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు.పొగాకు తినడం,పొగాకు నమలడం ద్వారా 70%మంది 30-60 ఏండ్ల వయస్సుల వారే రోగాలకు గురై తమ బంగారు లాంటి జీవితాన్ని అర్దాంతరంగా కోల్పో తున్నారు.

సెకండ్‌హ్యాండ్‌ ‌స్మోక్‌ అనేది మహా ప్రమాదకరం.పొగ తాగే వారికి ఎంత హానికరమో ఆ పొగను పీల్చిన ఇతరులకు కూడా అంతే హానికరము .పొగాకులో 4వేల రకాల రసాయనాలుంటాయి.వాటి ద్వారా మనిషికి 60 రకాలైన క్యాన్సర్‌ ‌వ్యాదులు వస్తాయి.నోటి క్యాన్సర్‌,‌కాలేయ క్యాన్సర్‌,ఊపిరితిత్తుల క్యాన్సర్‌,‌గుండె వ్యాదులు,పాదాలు కుళ్లిపోవడం,అల్జీమర్‌ ‌వ్యాదులు మగవారిలో జడత్వం కలిగి పిల్లలు పుట్టే సామర్ద్యాన్ని కోల్పోవడం,ఆడవారిలో సంతానాన్ని కనే శక్తిని కోల్పోవడం పొగ తాగే ఆడవారి పిల్లలు తక్కువ బరువుతో పుట్టి జీవితాంతం రిస్కును ఎదుర్కోవడం జరుగుతుంది.గర్బాశయ క్యాన్సర్‌, ‌మధుమేహం వంటి రోగాలు వస్తాయి.క్యాన్సర్‌ ‌వచ్చిన తరువాత నయం కావడం అసంభవము. భారతదేశంలో పొగాకు వాడటం వల్ల ప్రమాదకరమైన వ్యాదుల నుండి ప్రజలను కాపాడటానికి 2003లో సిగరెట్‌ ‌మరియు ఇతర పొగాకుఉత్పత్తుల చట్టంను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.బహిరంగ ప్రదేశాల్లోను,ఆఫీసులలోను పొగ తాగడం నేరం. అన్ని రకాల పొగాకు ఉత్పత్తుల ప్రకటలను ఈ చట్టంలో నిషేదించారు.ఎవరైనా 18 ఏళ్ల కంటే చిన్న పిల్లలు పొగాకు ఉత్పత్తులను అమ్మడం నేరం.స్కూల్లు,కాలేజీల ఆవరణం నుండి 100 గజాల దూరంలో పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరమని చట్టాల్లో పేర్కొన్నారు.కాని వీటినిఅమలు చేసే భాద్యత గల అదికారులు తగిన విదంగా ప్రచారం చేయకపోవడంతోఈ చట్టం మరుగున పడిపోయింది.అన్ని రకాల పొగాకు ఉత్పత్తులు హానికరమైనవే,ప్రమాకరమే,ప్రాణాలు తీసేవే చిన్న మోతాదులో పొగాకు ఉత్పత్తులు తీసుకున్న అవి తీరని హాని చేస్తాయి.బీడీలు,గుట్కా ,పొగాకుచుట్ట,జర్దాలుకూడా సిగరెట్లతో సమానంగా క్యాన్సర్‌ ‌కలిగిస్తాయి.ఇతరులు వదిలిన పొగను పీల్చడంద్వారా 40 రకాలైన ప్రాణాంతక వ్యాదులకు గురి అవుతారు.పొగాకు నమలడం ద్వారా నోటి క్యాన్సర్‌ ‌వంటి వ్యాదులు ఎక్కువవుతాయి.పొగాకు నియంత్రణ చట్టం సెక్షన్‌ 4 ‌ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నేరం.ఒకవేళ తాగితే త్రి వ్యక్తిపై 200/-,సంస్దపై,అదికారిపై అంతే జరిమాన విదించవచ్చు.సిగరెట్‌,‌పొగాకు ఉత్పత్తులపై ప్రచారం చేసిన యెడల మొదటి నేరం కింద 2సంవత్సరాల జైలు శిక్ష,లేదా వేయి రూపాయల జరిమానా రెండు విదించవచ్చును.సెక్షన్‌ 7,8,9 ‌పొగాకు ఉత్పత్తులపై చిత్రాల కూడిన హెచ్చరికలను ముద్రించకుండా వాటిని అమ్మడం నేరమే. ‘‘సిగరేటు యమమాటు ,మండిపోతుంది దాని రేటు బాగా తాగితే గుండెపోటు రోజు వదలాలి పచ్చనోటు అందికే మానాలి ఈ దురలవాటు’’ పొగతాగడం వల్ల జరిగే అనర్దాలను ప్రజలకు విరివిగా ప్రచారం చేయాలి.ప్రాణాలు హరిస్తున్న పొగాకు దురలవాటును మానిపించడానికి . గ్రామస్దాయి నుంచి జాతీయ స్దాయి ప్రభుత్వాలు సరైన అవగాహన కలిపించి వరకు కఠిన చట్టాలను అమలుచేయాలి. ప్రపంచంలో నియంత్రించగలిగే మరణాలకు పొగాకు పదార్దం ఒక్కటే ముఖ్య లక్షణం మన దేశంలో ఎయిడ్స్,‌క్షయ,మలేరియా మరణాల కంటే పొగాకు పదార్దాలను వాడటం వల్ల కలిగే మరణాలే ఎక్కువ.దేశంలో ఏటా 10 లక్షల ప్రాణాలు పొగాకు ఉత్పత్తుల వల్లనే పోతున్నాయంటే దాని తీవ్రత ఎంతో తెలుసుకోవచ్చు.

పొగాకు అలవాటు వల్ల 90% నోటి క్యాన్సర్లు వస్తున్నాయి. గుండెపోటు.మెదడు దెబ్బతినడం,ఊపిరితిత్తులు,అందత్వం ఇతర వ్యాదులు పొగాకు ఉత్పత్తులను వాడేవారికి అడ్వాన్సుగా వస్తాయి.మామూలు జనాని కన్నా వీరు 10 సం।।ల ముందే ముసలి వారు అయిపోతారు.మామూలు వారి కన్నా 10 ఏళ్ల ముందే చనిపోతారు.సిగరెట్లో 4వేల రకాల మిశ్రమాలు 200 రకాల విషపదార్దాలు 60 క్యాన్సర్‌కు కారణమయ్యే విషపదార్దాలు ఉంటాయి.గుట్కా మరియు జర్దా పొగాకు కలిగిన పాన్‌ ‌మసాలాలు,సిగరెట్లు.బీడీలతో సహా మన శరీరానికి నష్టం కలిగిస్తాయి.పొగాకు మహమ్మారి ఎవ్వరిని వదలదు.పొగాకు తాగే వారి కంటే వదలగా పీల్చుకున్న వారి జీవితం కూడా నరక ప్రాయమే ఇతరులు వదిలే సిగరెట్‌ ‌పొగను పీల్చడాన్ని ‘‘సెకండ్‌హ్యాండ్‌ ‌పొగ ’’ అంటారు.అన్నెం పున్నెం ఎరుగని పిల్లలు,వృద్దులు, గర్బిణీలు,గర్బస్ద శిశువులు సెకండ్‌హ్యాండ్‌ ‌పొగ వల్ల 40 రకాల వ్యాదులకు గురవుతున్నారు. వృద్దులకు మద్య చెవి పాడవడం మెదడు దెబ్బతినడం ఊపిరితిత్తులు పనిచేయకపోవడం గుండె సంబందిత వ్యాదులు రావడం,అస్దమా,క్షయ వంటి శ్వాసకోశ వ్యాదులు రావడం జరుగుతున్నాయి.మన దేశంలో చాలా మంది యువకులు పిల్లలు వారికి తెలియకుండానే పొగాకు అలవాటుకు గురవుతున్నారు.ఇందువల్ల వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మనదేశంలో అమలులో ఉన్న పొగాకు నియంత్రణ చట్టాలు ప్రభుత్వ కార్యాలయాలు,రైల్వే స్టేషన్లు.హోటళ్లు,రెస్టారెంట్‌లలో సమర్దవంతంగా పనిచేయకపోవడం వల్ల సెకండ్‌హ్యాండ్‌ ‌పొగపీల్చుకున్న వారి జీవితం దుర్బరమవుతున్నాయి.పొగాకు దురలవాట్లు మానడం వల్ల కలిగే లాభాలు ; పొగాకు గుట్కా వంటి అలవాటులను మానిన తర్వాత వారి శరీరంలో చాలా మార్పులు వస్తాయి.రెండేల్ల తర్వాత అతని శరీరంలోని నికోటిన్‌ ‌పూర్తిగా తొలిగిపోతుంది.12 సం।।ల తర్వాత అతని శరీరంలో పేరుకపోయిన విషవాయువు కార్బన్‌మోనాక్సైడ్‌ ‌పూర్తిగా తొలగిపోతుంది.ఊపిరితిత్తులు సక్సెగా పనిచేస్తాయి.మానిన 2 రోజుల తర్వాత దురలవాటు కలిగిన వ్యక్తికి వాసనను గ్రహించే శక్తి పెరుగుతుంది.ఎంత పనిచేసిన శారీరక శ్రమ అనిపించదు.2 నెలల తర్వాత ఊపిరితిత్తులు మరింత ప్రభాతవంతంగా పనిచేస్తాయి.గొంతు శ్వాస నాళాల్లో పేరుకపోయిన తెమడ తొలిగిపోతుంది.15 సం।।ల తర్వాత మామూలు వ్యక్తుల లాగే తయారవుతారు.కష్టం అనిపించిన పొగాకు ఉత్పత్తులను మానండి.పొగ తాగే వారికంటే వారు వదిలిన పొగను పీల్చే వారికే ప్రమాదమెక్కువ.
-రావుల లావణ్య రాజేశం లెక్చరర్‌, ‌సెల్‌ 7780185674

Leave a Reply