Take a fresh look at your lifestyle.

మట్టి మనిషికి హారతి

మెతుకు పెట్టే చేతులకు
ఆంక్షల సంకెళ్లు వేయొద్దు

చెమట చిందించే దేహాలను
శకటాలతో తొక్కి చంపొద్దు

న్యాయం అర్తించే గళాలను
ఉరి తాడుకు వేలాడేయొద్దు

ధర్మబద్దమైన ఆందోళనకు
అపరాధాన్ని అంటగట్టొద్దు

నీతి తప్పని మట్టి మనిషిని
జాతి విద్రోహిగా చిత్రించొద్దు

జాతి ఆదరువైన రైతును
అధోగతి పాలు చేయొద్దు

ప్రగతి దీపాలైన పల్లెలను
శవాల దిబ్బగా మార్చొద్దు

కర్షకుని కన్నీటి ధారతో…
కార్పొరేట్ల కాళ్ళు కడగొద్దు

అన్నార్తుల అక్రందనతో…
బ్యూరోక్రాట్ల స్వాగతించొద్దు

శ్రమజీవుల కష్టార్జితంతో..
సంపన్న కడుపు నింపొద్దు

అధికార దురహంకారంతో
అన్నదాతకు చితి పేర్చొద్దు
దేశాన్ని అమ్మకానికి పెట్టొద్దు

ఎద్దు ఏడ్చిన ఎవుసం
ఏడింతలుగా రెట్టింపవదు

రైతు చావులున్న సమాజం
సస్య శ్యామలమై శోభిల్లదు

రైతు వ్యతిరేక పాలకా !
ఒంటెద్దు పోకడ పక్కనెట్టి
సేద్యానికి స్వేచ్ఛ కట్టబెట్టు
మట్టి మనిషికి హారతి పట్టు

– కోడిగూటి తిరుపతి,95739 29493

Leave a Reply