శ్రీనగర్, జనవరి 17 : జమ్మూకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బుద్గామ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. బుద్గాం పట్టణంలోని కోర్టుకు సవి•పంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. అనుమానాస్పద వాహనాన్ని అడ్డుకునేందుకు ఆర్మీ అధికారులు, పోలీసులు యత్నించగా.. వాహనంలో ఉన్న ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని అన్నారు.
దీంతో ఆర్మీ అధికారులు ఎదురుకాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు వివరించారు. ఉగ్రవాదుల నుండి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, సైన్యం బుద్గామ్లోని ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.