
సిరిసిల్ల ఫిబ్రవ రి 20 నుండి 22 వరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే మహాశివరాత్రి జాతరలో పాల్గొనే భక్తులకు భారీ వ్యయంతో వివిధ సౌకర్యాలు కల్పించాలని జాతర సమన్వయ కమిటి సమావేశం నిర్ణయించింది.రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధ్యక్షతన దేవస్థానం ఆవరణలోని ఓపెన్ స్లాబ్ హాల్లో గురువారం జాతర సమన్వయ కమిటి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఎస్పీ రాహుల్ హెగ్డే,జెసి యాస్మీన్బాషా,జిల్లా ప్రత్యేక అధికారి రాహుల్ శర్మ,ట్రైనీ కలెక్టర్ సత్యప్రసాద్,జడ్పీ సిఇఓ గౌతంరెడ్డి,ఆర్డీఓ శ్రీనివాస రావు,వేములవాడ డిఎస్పీ చంద్రకాంత్ ,దేవస్థానం ఇఓ కృష్ణవేణి,డిఎం• హెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ లతో పాటు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు,దేవస్థానం సిబ్బంది, దేవస్థా నం స్థానాచార్య అప్పాల భీమాశంకర్శర్మలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహాశివరాత్రికి చేపట్టాల్సిన వివిధ ఏర్పాట్లను కలెక్టర్ కృష్ణ భాస్కర్ ద్వారా దేవస్ధానం ఇఓ కృష్ణవేణి వెల్లడింపచేశారు.
ఈ జాతరలో తాము 670 బస్సులను నిర్వహిస్తామని,మేన్ బస్స్టేషన్నుండి దేవస్థానం వరకు మినీ బస్సులను ఉచితంగా నిర్వహిస్తామని ఆర్టీసి అధికారులు వెల్లడించా రు. జాతరలో ఇబ్బందుల కలుగకుండా గతంలో మాదిరిగానే పార్కింగ్ స్ధలాలను ఏర్పాటు చేస్తున్నామని,దీనికి తోడుగా భక్తులు ప్రయానించిన ఆటోలను పార్కింగ్ చేయడానికి ప్రత్యేక స్థలాన్ని ఎంపిక చేస్తామని అధికారులు వెల్లడించారు.ఈ పార్కింగ్ స్థలాల్లో విద్యుత్ సదుపాయం కల్పిస్తామని వారు వెల్లడించారు. వేములవాడకు ప్రవేశించే అన్ని రోడ్లు,బైపాస్ రోడ్లు సక్రమంగా ఉంచాలని,సైన్ బోర్డులు అమర్చాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో వారికి తాత్కాలిక వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని,అక్కడ మరుగు దొడ్లు,నీటి సౌకర్యం కల్పిస్తామని దేవస్థానం ఇఇ రాజేశ్ వెల్లడించారు..జాతరలో ఎలాంటి అంటు వ్యాధులు ప్రబల కుండా తాము చర్యలు తీసుకుంటామని,ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్,మరియు 104 వాహనాలను సిద్ధంగా ఉంచుతామని,జిల్లాలోని వైద్యాధికారులకు విధులను కేటాయిస్తామని డిఎం హెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్,వేములవాడ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేగుల పాటి మహేశ్రావులు వెల్లడించారు.
Tags: Massive arrangement, Maha Shivaratri, siricilla, vemulavada rajanna, temple, dmho dr chandrasekhar