Take a fresh look at your lifestyle.

కారులో ఎక్కించుకుని సామూహిక అత్యాచారం

Mass rape in a car
 ఎన్ని కఠినచట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. తాజాగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రం కబీర్‌ధామ్‌ జిల్లాలోని టారెగావ్‌ అటవీ ప్రాంతంలో ఓ మహిళపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 17న బాధిత మహిళ గ్రామస్థులతో కలిసి సమీపంలోని మావై గ్రామంలో జరుగుతున్న జాతరకు వెళ్లింది. తిరిగి గ్రామానికి వస్తున్న క్రమంలో సున్రేహా గ్రామం వద్ద నలుగురు వ్యక్తులు కారులో వచ్చి, తామూ అటువైపే వెళ్తున్నామని ఆమెను కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత దుండగులు గ్రామంవైపు కాకుండా సమీపంలో అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడైన ఆదిత్యతో పాటు మన్‌హరన్‌, రాజారాం, బోరందేవ్‌లపై ఐపీసీ సెక్షన్‌ 376, 36 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులంతా 22 నుంచి 29 మధ్య వయస్కులే.

Leave A Reply

Your email address will not be published.